అలరించిన సంక్రాంతి సంబరాలు

కోలాటం ఆడుతున్న మహిళలు, తిలకిస్తున్న అతిథులు

ప్రజాశక్తి- మునగపాక

మండలంలోని తిమ్మరాజుపేట గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన సంక్రాంతి సంబరాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శరగడం జగదీష్‌, మల్ల లక్ష్మీనారాయణ, కాండ్రేగుల వెంకట అప్పారావు మిత్ర బృందం సహాయ సహకారాలతో గ్రామంలోని యువకులు, వృద్ధులు, గృహిణులు, పిల్లలు వారి వారి కళా ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. సంక్రాంతి సంబరాలను వీక్షించేందుకు విచ్చేసిన దర్శకులు నెక్కిన త్రినాధరావు, సినిమా, టీవీ నటులు బాలాజీ, ప్రసన్న కుమార్‌ రెడ్డి, కళాభిమాని, నాగార్జున ఫ్యాన్స్‌ రాష్ట్ర అధ్యక్షులు మల్ల సురేంద్ర తదితరులు వారితో ఆడి పాడారు. గ్రామస్తులు జరిపిన కళా ప్రదర్శనలను కొనియాడారు. అనంతరం గ్రామానికి చెందిన రంగస్థలం నటులు ఆడారి సూరిబాబు, సినీ దర్శకులు నెక్కిన త్రినాధరావులకు పౌర సన్మానం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ భీమిశెట్టి మంగ లక్ష్మి కృష్ణారావు, డాక్టర్‌ ఉమా శంకర్‌, మాజీ సర్పంచ్‌ శరగడం జగన్నాథరావు, ఉపసర్పంచ్‌ కాండ్రేగుల జగన్‌, బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమరశెట్టి శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు మల్ల స్వామి, సరగడం వెంకునాయుడు, కొయిలాడ శివాజీ, పెంటకోట మహాలక్ష్మి నాయుడు, ఉత్సవ కమిటీ చైర్మన్‌ సరగడం నాయుడు, పెంటకోట రామప్పారావు తదితరులు పాల్గొన్నారు.

➡️