అవకాశం ఇస్తే ఉన్నతస్థాయికి ఆడపిల్లలు

Jan 25,2024 00:30

ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, డిఎంఅండ్‌హెచ్‌ఒ
ప్రజాశక్తి-గుంటూరు :
జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక నగరంపాలెంలోని స్టాల్‌ గరల్స్‌ హైస్కూల్‌ బాలికలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.విజయలక్ష్మి మాట్లాడుతూ అవకాశం ఇస్తే ఆడపిల్లలు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. పౌష్టికాహారం, క్రమం తప్పకుండా ఇవ్వడం ద్వారా వారు రక్తహీనతకు లోనుకాకుండా చూడాలని, ప్రతి గురువారం ఐరన్‌ మాత్రలు తప్పకుండా తీసుకోవాలని చెప్పారు. అవసరమైతే పాఠశాలల్లోనే వైద్యశిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్‌సిడి ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రావణబాబు, డిఐఒ డాక్టర్‌ కె.వి.సుబ్బరాజు, డిఎన్‌ఎంఒ డాక్టర్‌ లక్ష్మానాయక్‌, డెమో జయప్రసాద్‌, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ ఇస్మాయిల్‌, లీగల్‌ కన్సల్టెంట్‌ వాణి, హెచ్‌ఎం అనంతకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.

➡️