ఆక్రమణల తొలగింపు

 ప్రజాశక్తి -పిఎం పాలెం : జివిఎంసి ఆరో వార్డు పరిధి కొమ్మాది జవహర్‌ నవోదయ విద్యాలయం సమీపంలోని సర్వే నెంబర్‌ 153/2 లోని గెడ్డ వాగు స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను చినగదిలి రెవెన్యూ అధికారులు ఆదివారం జెసిబి సహాయంతో తొలగించారు. సుమారు రెండు వందల గజాల స్థలాన్ని చదును చేసి నిర్మాణం చేపట్టిన సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఆదివారం తొలగించి రూ.కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విఆర్‌ఒ శ్రీనివాస్‌, సచివాలయ విఆర్‌ఒ శ్రీను, విఆర్‌ఎ బంగారు రాజు, శ్రీను పాల్గొన్నారు.

 

➡️