ఆక్వా రైతులకు ఎంఎం కొండయ్య పరామర్శ

ప్రజాశక్తి-చిన్నగంజాం: టిడిపి చీరాల నియోజకవర్గ ఇన్‌ఛార్జి మద్దులూరి మాలకొండయ్య ఆక్వా రైతుల ఆహ్వానం మేరకు చిన్నగంజాంలో ఆక్వా సాగును మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వా రైతులకు గిట్టుబాటు ధరలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సబ్సిడీని పునరుద్ధరించాలని, ఫీడ్‌కు వాడే ముడి సరుకుల ధరలు నియంత్రించాలని, తద్వారా ఫీడ్‌ తక్కువ ధరలకు అందించాలని, అంతర్జాతీయ మార్కెటింగ్‌ సౌకర్యాన్ని కలగజేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అధునాతన యంత్రాలతో ఆక్వాఫీడ్‌ మిల్లులు నెలకొల్పి అంతర్జాతీయ మార్కెట్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పించాలని, గిట్టుబాటు ధరలు అందేటట్లుగా రానున్న తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తే ఆక్వా రైతులకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. రైతుల సాదకబాదకాలు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళతానని, రైతు ప్రయోజనాలే ధ్యేయంగా చంద్రబాబు కృషి చేస్తారని తెలిపారు.

➡️