ఆగస్టు వరకు జిప్సా కార్యవర్గం కొనసాగింపు

గాజువాక పారిశ్రామిక ప్రాంత ప్రైవేట్‌ పాఠశాలల సంఘం (జిప్సా)

ప్రజాశక్తి -గాజువాక : .గాజువాక పారిశ్రామిక ప్రాంత ప్రైవేట్‌ పాఠశాలల సంఘం (జిప్సా) ప్రస్తుత కార్యవర్గ కాలపరిమితి ఈనెలాఖరుతో ముగస్తున్నప్పటికీ, దాన్ని వచ్చే ఆగష్టు వరకు కొనసాగించాలని జిప్సా సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆదివారం పాతగాజువాక యశోద విద్యానికేతన్‌ స్కూల్‌లో జిప్సా అధ్యక్షులు పాలవలస భాస్కరరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రస్తుత జిప్సా కార్యవర్గ రెండేళ్ల కాలపరిమితి ముగిసినప్పటికీ, వచ్చే ఏడాది ఆగస్టులో ఎన్నికలు నిర్వహించాలన్న సభ్యుల ఏకాభిప్రాయం మేరకు అప్పటివరకు ప్రసుత్త కార్యవర్గం కొనసాగుతుందన్నారు.ప్రైవేట్‌ పాఠశాలల గుర్తింపు రెన్యువల్‌కు సమస్యలు, వాటి పరిష్కారాలు సభ్యులకు వివరించారు జిప్సా, రాష్ట్ర అప్సాతో అనుసంధానమైన దృష్ట్యా, వచ్చేనెలలో ఉమ్మడిగా రెండు సంఘాల సభ్యులతో విహార యాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జిప్సా ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాస్‌, కోశాధికారి డి.శ్రీనివాస్‌, గౌరవాధ్యక్షుడు శోభన్‌బాబు, సలహాదారు ఎం.జగ్గారావు, మురళీ, జగన్‌, పరశురాం,వాసుదేవరావు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్స్‌ 70మంది వరకు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జిప్సా అధ్యక్షుడు భాస్కరరావు

➡️