ఆటపాటలతో అంగన్‌వాడీల నిరసన

అంగన్‌వాడీల నిరసన

ప్రజాశక్తి-యంత్రాంగం తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 21వ రోజుకు చేరుకుంది. ఆటపాటలతో వినూత్నంగా నిరసన తెలిపారు. అమలాపురంలో చేపట్టిన నిరవధిక సమ్మెలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమ్మె శిబిరంలో పి.అమూల్య, విజయ, రత్నకుమారి, మణిమాల, దైవకృప, బేబీ గంగారత్నం పాల్గొన్నారు.మండపేట మున్సిపల్‌ కార్యాలయం వద్ద పలువురు నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మెను మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలక్ష్మి, బేబీ, వజ్రం, సూర్యకుమారి, కుమారి పాల్గొన్నారు.మామిడికుదురు తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు సెల్‌ ఫోన్‌లు, చీరలకు పూజలు చేశారు. మంత్రి ఉషశ్రీ చరణ్‌ రూ.కోట్లు ఖర్చు పెట్టి చీరలు, సెల్‌ఫోన్లు అందజేశామని ప్రచారం చేసుకోవడం విడ్డురంగా ఉందన్నారు. పెరిగిన ధరలు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జి.సీతామహాలక్ష్మి, జి.సూర్యకాంతం, కుమారి, అన్నపూర్ణ పాల్గొన్నారు. రామచంద్రపురం కె.గంగవరం మండలాల అంగన్‌వాడీలు స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నాలో కూర్చున్నారు. ఈ ధర్నాలో జిల్లా కార్యదర్శి నూకల బలరామ్‌, అంగన్‌వాడీల యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎం.దుర్గమ్మ, ప్రాజెక్టు అధ్యక్షురాలు వి.వీరలక్ష్మి మాట్లాడారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఆటల పాటలతో నిరసన తెలిపారు. యునైటెడ్‌ యూనియన్‌ నాయకులు రాజు, బాటసారి సత్యనారాయణ అంగన్‌వాడీల మీద పాట పాడి మద్దతు తెలిపారు. క్వారీ లారీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సతీష్‌, నాగరాజు, శంకర్‌, దొరబాబు, కాంగ్రెస్‌ నాయకులు కె.ప్రభాకర్‌, కె.శ్రీనివాస్‌, తెలుగుదేశం మహిళా నాయకులు మద్దతు తెలిపారు. సమ్మెలో అంగన్‌వాడీ నాయకులు వాసంశెట్టి సూర్యకుమారి, విజయలక్ష్మి, శ్రీదేవి, జెహరా, దుర్గ, వెంకటరత్నం, గొంతి దేవి, వీరవేణి పాల్గొన్నారు.ముమ్మిడివరం స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అధ్యక్ష కార్యదర్శులు దుర్గా మల్లేశ్వరి, జయలక్ష్మి ఆధ్వర్యాన చేపట్టిన రిలే దీక్షలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి.దుర్గాప్రసాద్‌ మాట్లాడారు. తాళాలు వాయిస్తూ అంగన్‌వాడీలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ దీక్షలో సుబ్బలక్ష్మి, హైమావతి, టి.శ్రీదేవి, తలుపులమ్మ, జి.మంగాయమ్మ, విజయ రత్న కుమారి పాల్గొన్నారు.

➡️