‘ఆడుదాం ఆంధ్రా’కు ప్రతిఒక్కరిని ప్రోత్సహించాలి

ప్రజాశక్తి – ముసునూరు

ఆడుదాం ఆంధ్ర ఆటలకు ప్రతి ఒక్కరిని ప్రోత్సాహించాలని ముసునూరు ఎంపిపి కోండా దుర్గాభవానీ వెంకట్రావ్‌ అధికారులకు సూచించారు. బుధవారం మండలంలోని మండల పరిషత్‌ కార్యలయంలో జెడ్‌పిటిసి డాక్టర్‌ ప్రతాప్‌, వైస్‌ ఎంపిపి కోటగిరి రాజానాయనల ఆధ్వర్యంలో మండలంలోని 16 గ్రామ సచివాలయం అధికారులతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ జి.రాణి మాట్లాడుతూ 15 సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తి (పురుషులు- మహిళలు) కూడా ఆడే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యమ్రంలో మండల వైసిపి అధ్యక్షులు మూల్పురి నాగవల్లేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు ఆరేపల్లి వెంకటేశ్వరరావు, మువ్వ స్రవంతి, వైవి.ప్రసాద్‌, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

➡️