అభివృద్ధి పనులు పరిశీలించిన రైల్వే జిఎం

Jun 20,2024 20:13

 ప్రజాశక్తి-విజయనగరం కోట : ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పరిధిలో అమృత్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను రైల్వే జనరల్‌ మేనేజర్‌ పరమేశ్వర్‌ పన్క్వాల్‌ గురువారం పరిశీలించారు. విశాఖ నుంచి విజయనగరం మీదుగా బొబ్బిలి, పార్వతీపురం, ధమన్‌జోడీ, కోరాపుట్‌ వరకు జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. విజయనగరం రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరాలను స్టేషన్‌ మాస్టర్‌ మురళీకృష్ణను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఎం సౌరబ్‌ ప్రసాద్‌ రావు, చీఫ్‌ ట్రాక్‌ ఇంజినీర్‌ కె.ధనుంజరు రావు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

➡️