‘ఆడుదాం ఆంధ్రా’పై అవగాహన ర్యాలీ

Dec 23,2023 21:41
ఫొటో : ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎం.ఎల్‌.ఎ. రామిరెడ్డి

ఫొటో : ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎం.ఎల్‌.ఎ. రామిరెడ్డి
‘ఆడుదాం ఆంధ్రా’పై అవగాహన ర్యాలీ
ప్రజాశక్తి-కావలి : కావలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం ఆడుదాం ఆంధ్రా మన అందరి ఇంట పథకంపై అవగాహనా ర్యాలీని ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కావలి ఆర్‌డిఒ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ట్రంక్‌ రోడ్డు మీదుగా మున్సిపల్‌ కార్యాలయం వరకు సాగింది. ఈ ర్యాలీ అగ్రభాగాన ఎంఎల్‌ఎ రామిరెడ్డి, ఆర్‌డిఒ వి.కె.శీనా నాయక్‌, తహశీల్దారు మాధవ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జి.శ్రావణ్‌ కుమార్‌, పలు పాఠశాలల పిఇటిలు, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️