ఆత్మ రక్షణకు కరాటే దోహదం

Dec 10,2023 14:27 #Kakinada
  • అట్టహాసంగా రెండవ జాతీయ స్థాయి కరాటే పోటీలు

ప్రజాశక్తి – సామర్లకోట రూరల్ : విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు ఆత్మరక్షణకు కరాటే క్రీడ ఎంతో దోహదపడుతుందని లైన్స్ క్లబ్ జిల్లా మొదటి వైస్ గవర్నర్ ఈదల ఈశ్వర కుమార్, కరాటే ఇండియా చీఫ్, ఆంధ్ర, తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఆర్ మల్లికార్జున గౌడ్ లు అన్నారు. సామర్లకోట పట్టణంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గల డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో శ్రీ భీమేశ్వర సామర్లకోట లైన్స్ క్లబ్ సౌజన్యంతో రెండవ జాతీయస్థాయి కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం ఘనంగా జరిగాయి. స్థానిక కరాటే కోచ్ కరాటే అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి శంకరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను తొలుత ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభ సభలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు వ్యాయామం ఆత్మ రక్షణ క్రీడల్లో ప్రవేశం ఎంతైనా అవసరం ఉందన్నారు. కరాటే క్రీడలో సంపాదించుకున్న సర్టిఫికెట్ల ద్వారా విద్యార్థులు ఉన్నత భవిష్యత్తును పొందగలరన్నారు. క్రీడల్లో రాణించడం ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం అయినప్పటికీ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్థానిక కోచ్ శంకర్ ఉచితంగా కాకినాడ నగరం నుంచి విచ్చేసి విద్యార్థులకు ఆత్మ రక్షణ శిక్షణలు కరాటే క్రీడ ద్వారా అందించడం అభినందనీయమన్నారు. గత 17 ఏళ్లుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జాతీయస్థాయి పోటీలకు స్థానిక లైన్స్ క్లబ్ శ్రీ భీమేశ్వర సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. కాగా రానున్న రోజుల్లోనూ వారి సహాయాన్ని అందిస్తూ పిల్లలకు విద్యార్థులకు ఆత్మరక్షణ కలలను అందించి ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా కరాటే పోటీలను ముఖ్య అతిథులు ఈశ్వర కుమార్, మల్లికార్జున గౌడ్లు ప్రారంభించారు. తొమ్మిది రాష్ట్రాల నుండి సుమారు 800 మంది విద్యార్థులైన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనగా వారి అత్యంత ప్రతిభను కనబరిచి పథకాలు సాధించారు. విజేతలకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా పథకాలు సర్టిఫికెట్లను, జ్ఞాపికలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రజల నాకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చిత్తూరు వీర్రాజు (రాజా), లయన్స్ రీజనల్ చైర్మన్ చిత్తులూరి శ్రీదేవి, జోన్ చైర్మన్ గణేష్ ప్రసాద్, అడిషనల్ డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ ఎం శివ నాగ కృష్ణ, పిఎసిఎస్ అధ్యక్షులు మేకా శ్రీనివాసరావు, అధ్యక్షులు కే విజయ కృష్ణారావు, కార్యదర్శి ఎస్ ఆర్ వై వి రామలింగ ప్రసాద్, కోశాధికారి డి సీతారామరాజు, ప్రతిభా పాఠశాల కరస్పాండెంట్ ఎస్ వీ వీ జీ ప్రకాష్, ఆంధ్రప్రదేశ్ పీఈటీ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ జార్జి, కాకినాడ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు వి రవిరాజు, జనసేన అద్యక్షులు డి శ్రీనివాసరావు (సరోజ వాసు), ఎడగంటి గ్రామ సర్పంచ్ సిహెచ్ గోవిందరాజు, కరాటే ఏపీ స్టేట్ ప్రధాన కార్యదర్శి ఎం వి ఎస్ ఎన్ మూర్తి, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ నాయకులు బొడ్డు రామారావు, బి.సత్యనారాయణ, ఎం లోవరాజు, తొమ్మిది రాష్ట్రాలకు చెందిన కోచ్ లు, వందల సంఖ్యలో విద్యార్థులైన క్రీడాకారులు పాల్గొన్నారు.

➡️