ఆదర్శప్రాయులు సిల్వన్‌ రాజు: మంత్రి సురేష్‌

ప్రజాశక్తి-శింగరాయకొండ: ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌)గా ఉద్యోగోన్నతి పొందిన ఇన్కమ్‌ టాక్స్‌ ఆఫీసర్‌ కురుగుంట్ల సిల్వన్‌రాజు ఆదర్శప్రాయులని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. శనివారం రాత్రి టంగుటూరు లో మసీద్‌ సెంటర్లో సిల్వన్‌ రాజుకు జరిగిన పౌర సన్మాన కార్యక్రమంలో మంత్రి సురేష్‌ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఇన్కమ్‌ టాక్స్‌ ఆఫీసర్‌ నుంచి అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఉద్యోగోన్నతి పొందటం అభినందనీయమ న్నారు. సిల్వన్‌ రాజు సమాజ సేవలోనూ స్ఫూర్తిదాయకంగా నిలిచారని చెప్పారు. మూడు నియోజకవర్గా ల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు గత 20 సంవత్సరాల నుంచి ఉచితంగా పుస్తకాలు అందజేస్తున్నారని చెప్పా రు. పేదల కోసం ఆశాలత ఫౌండేషన్‌ స్థాపించి వారికి అవసరమైన దుస్తులు, నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారని చెప్పారు. సిల్వన్‌ రాజు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ.. మరెన్నో ఉన్నత స్థానాలు అధిరోహిం చాలని ఆకాంక్షించారు. అనంతరం ఐఆర్‌ఎస్‌ హోదా పొందిన కె సిల్వన్‌ రాజు – స్నేహలత దంపతులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు బోట్ల రామారావు, డాక్టర్‌ బాలకృష్ణ, డాక్టర్‌ రమేష్‌ బాబు, పుట్టా వెంకటరావు, క్రీడ్‌ మినిస్ట్రీస్‌ డైరెక్టర్‌ జోబ్‌, సిల్వన్‌ రాజు కుమారుడు డాక్టర్‌ సువర్ణరాజు, కుమార్తె డాక్టర్‌ మౌనిక, ఒంగోలు ఉపాస్‌ హాస్పిటల్‌ డైరెక్టర్లు డాక్టర్‌ ఉమాపతి చౌదరి, డాక్టర్‌ ప్రకాష్‌ చవల, డాక్టర్‌ అనిల్‌ కుమార్‌, పౌర సన్మాన కమిటీ సభ్యులు మురళి, కె జానుబాబు, టి డేవిడ్‌ రాజు, కె ఆనందరావు, జి రాజేష్‌, పి ఆశీర్వాదం, జి సుగుణకర్‌, షేక్‌ అలెగ్జాండర్‌, టి అశోక్‌, పిఈటీ కె బాలకోటయ్య, నాగభూషణం పాల్గొన్నారు.

➡️