ఆరోగ్యానికి క్రీడలు, వ్యాయాయ అవసరం : కలెక్టర్‌

Dec 26,2023 21:42

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : ప్రస్తుత జీవన శైలిలో మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు, వ్యాయామం అత్యంత ఆవశ్యకమని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను మండలంలోని నర్సిపురం జిల్లా పరిషత్‌ పాఠశాల క్రీడా మైదానంలో స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల్లో భాగంగా క్రికెట్‌, వాలీ బాల్‌, కబడ్డీ, టెన్ని క్యాయిట్‌, ఖో ఖో పోటీలను కలెక్టర్‌, ఎమ్మెల్యే క్రీడాభిమానుల కేరింతల మధ్య ఆటలు ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా సంబరాలను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 10వరకు 47 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు అనంతరం కీడాకారులను పరిచయం చేసుకొని అభినందనలు తెలియజేశారు. తొలుత వివిధ విభాగాల క్రీడాకారులకు ప్రభుత్వం అందించిన క్రీడా సామాగ్రిని కలెక్టర్‌, ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ బంగరమ్మ, అర్జున అవార్డు గ్రహీత ఎస్‌ జయరాం, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌.వెంకటేశ్వరరావు, ఎంపిడిఒ జావెద్‌, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.సీతంపేట : స్థానిక గ్రీన్‌ ఫీల్డ్‌ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర పోటీలను ఐటిడిఎ పిఒ కల్పనా కుమారి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి బి.ఆదినారాయణ, ఎఎంసి చైర్మన్‌ హెచ్‌.మోహనరావు, జెడ్‌పిటిసి ప్రతినిధి రాము, ఎంపిడిఒ కె.గీతాంజలి, స్పోర్ట్‌ ఇన్‌ఛార్జి జాకబ్‌ దయానంద్‌, పలువురు పిడిలు, పిఇటిలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.కురుపాం : జియమ్మవలస మండలం పెదమేరంగి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి ప్రారంభించారు. అలాగే కురుపాంలోని శివన్నపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎంపిపి శెట్టి పద్మావతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఆర్‌డిఒ ఎం.లావణ్య, డిపిఒ బి.సత్యనారాయణ, ఎంఇఒ ఎన్‌.సత్యనారాయణ, జెడ్‌పిటిసి సభ్యులు జి.సుజాత, ఉప సర్పంచ్‌ షేక్‌ ఆదిల్‌, జిల్లా కోప్షన్‌ సభ్యులు షేక్‌ నిసార్‌, ఎంపిటిసి సభ్యులు వి.బంగారునాయుడు, స్వామి యోజులు, పిఎసిఎస్‌ చైర్మన్‌ కె.గౌరీశంకర్‌ సచివాలయ సిబ్బంది, వాలంటీరుల పాల్గొన్నారు.కొమరాడ : ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలను జెడ్పిటిసి సభ్యులు ద్వారపురెడ్డి లక్ష్మి, ఎంపిపి శెట్టి శ్యామల స్థానిక గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలోనూ, మాదిలింగిలో ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఎం.మల్లికార్జునరావు ఎంఇఒలు నారాయణస్వామి, తిరుపతి నాయుడు, ప్రెసిడెంట్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ లక్ష్మణరావు, కొమరాడ సొసైటీ అధ్యక్షులు ఎన్‌.సూరప్ప నాయుడు, ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. మక్కువ : మండలంలోని ములక్కాయ వలస మోడల్‌ పాఠశాల, ఎర్రసామంత వలస గిరిజన ఆశ్రమ పాఠశాల, మక్కువ, శంబర ఉన్నత పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విద్యార్థుల్లో క్రీడల పట్ల ఉన్న ఆసక్తి తద్వారా వారి నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందని జెడ్పిటిసి సభ్యులు మావుడి శ్రీనివాసరావు అన్నారు. కార్యక్రమంలో వైసిపి మండల నాయకులు రంగునాయుడు, ఎంపిడిఒ సూర్యనారాయణ, తహశీల్దార్‌ సూర్యనారాయణ, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : మండలంలోని భద్రగిరి గిరిజన గురుకుల పాఠశాలలో ఆడుదాం ఆంధ్ర క్రీడలను ఎంపిపి కె.దీనమయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో ఎల్విన్‌పేట, గుమ్మలక్ష్మీపురం సర్పంచులు ఆర్‌.చైతన్య స్రవంతి, బి.గౌరీశంకర రావు, బిసి రజక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జి.గిరిబాబు, వైసిపి జిల్లా యువజన విభాగం కార్యదర్శి నిమ్మక గోపాల్‌, ఎంఇఒ చంద్రశేఖర్‌, ప్రిన్సిపల్‌ యుగధర్‌, పంచాయతీ కార్యదర్శులు శ్యామల, కిషోర్‌ సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.జియ్యమ్మవలసలో… మండలంలోని రావాడ రామభద్రపురం, పెదమేరంగి, చిన మేరంగి, పిప్పల భద్ర, జియమ్మ వలస సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న క్రీడలకు 3వేల మంది పైగా యువత క్రీడలు ఆడేందుకు పేరు నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మండలంలోని ఎల్విన్‌ పేట, కేదారిపురం, పెద్దఖర్జ, దుడ్డు ఖల్లు, దొరజమ్ము, మండ, బాలేసు సచివాలయం పరిధిలో ఆడుదాం ఆంధ్ర క్రీడలు నిర్వహిస్తున్నారు. క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, కోకో, షటిల్‌ బ్యాట్మెంటన్‌ డబుల్‌ క్రీడలను యువత ఆడనున్నారు.సీతానగరం : మండలంలోని జోగింపేట అంబేద్కర్‌ గురుకుల పాఠశాల ఆవరణలో మంగళవారం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ఆర్‌డిఒ కె.హేమలత ప్రారంభిం చారు. అలాగే సీతానగరం, బూర్జ, నిడగల్లు, గాజులవలస జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానాల్లో ఆడుందాం ఆంధ్ర కార్యక్రమంలో ఆటలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఎంఎస్‌ఎల్‌ఎన్‌ ప్రసాద్‌, తహశీల్దార్‌ ఎంవి రమణ, ఎంపిపి రవణమ్మ శ్రీరామనాయుడు, జెడ్‌పిటిసి సభ్యులు ఎం.బాబ్జీ, జోగింపేట సర్పంచ్‌ కళ్ళెంపూడి సింహాచలం, ఎంపిటిసిలు సురగాల గౌరీకిరణ్‌, బురిడీ కుసుమ సూర్యనారాయణ, ఎంఇఒలు జి.సూర్యదేవుడు, ఎం.వెంకట రమణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.సాలూరు రూరల్‌ : మండలంలోని తోణాంలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని వైసిపి జిల్లా కార్యదర్శి దండి శ్రీనివాసరావు ప్రారంభించారు. అలాగే మామిడిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వైసిపి మండలాధ్యక్షులు సువ్వాడ భరత్‌ శ్రీనివాసరావు, వైస్‌ ఎంపిపి సువ్వాడ గుణావతి, సర్పంచులు సువ్వాడ శశికళ, తొత్తడి నారాయణమ్మ, చీమల రాములమ్మ, మువ్వల ఆదయ్య, జిల్లా సేవాదళ్‌ అధ్యక్షులు రామకృష్ణ, వెంకట రమణ, మాధవరావు, కార్యదర్శులు, సచివాలయం, వైద్య సిబ్బంది, విద్యార్దులు పాల్గొన్నారు.భామిని : మండలంలో ఆడుదాం -ఆంధ్ర పోటీలను ఎంపిపి ప్రతినిధి తోట సింహాచలం ప్రారంభించారు. అలాగే బత్తిలిలో ఎంపిటిసి టింగ అన్నాజీరావు, సర్పంచ్‌ బిడ్డిక తమ్మారావు, బాలేరులో జెసిఎస్‌ కో ఆర్డినేటర్‌ కొత్తకోట చంద్రశేఖర్‌, సర్పంచ్‌ జామి ప్రభాకర్‌ ఆడుదాం -ఆంధ్ర పోటీలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఉమామహేశ్వరి, వైస్‌ ఎంపిపి బోనగడ్డి ధర్మారావు, జెడ్‌పిటిసి బొడ్డేపల్లి ప్రసాదరావు, ఎంఇఒ భాస్కరరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు గెల్లంకి రమేష్‌, వైసిపి నాయకులు కొత్తకోట ఆంజనేయులు, చలపతి రావు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.పాచిపెంట : ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంపిపి బి.ప్రమీల ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ లక్ష్మీకాంత్‌, ఎఒ బివిజె పాత్రో, వైస్‌ ఎంపిపిలు మీసాల నారాయణ, కొల్లి రవీంద్ర, డోల బాబ్జీ, పి.వీరంనాయుడు, దండి ఏడుకొండలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.సాలూరు: ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్‌ చైర్మన్లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు ప్రారంభించారు. అలాగే వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో నమోదు చేసుకున్న క్రీడాకారులతో ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి.వాలీబాల్‌ ఆడిన ఐటిడిఎ పిఒఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఐటిడిఎ పిఒ విష్ణు చరణ్‌ వాలీబాల్‌ ఆడి యువకులను ఉత్సాహపరిచారు. పిఎన్‌ బొడ్డవలస సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మైదానంలో నిర్వహించిన పోటీలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జయరాం, వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌, ఎఎంసి చైర్‌పర్సన్‌ దండి అనంతకుమారి, ఎంపిడిఒ పార్వతి, మున్సిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు.పాలకొండ : మండలంలోని అట్టలిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్‌ విక్రాంత్‌ బాబు, ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపిలు బొమ్మాళి భాను, దమలపాటి వెంకటరమణనాయుడు, పాలకొండ వైస్‌ ఎంపిపిలు కణపాక సూర్యప్రకాష్‌, వాకముడి అనిల్‌, నాగవంశపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నల్లి శివప్రసాద్‌, ఎంఎంఎస్‌ అధ్యక్షులు కణుముల కల్పనా సూర్యనారాయణ, సర్పంచులు, ఎంపిటిసిలు, వైసిపి నాయకులు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే స్థానిక డిగ్రీ కళాశాల ఆవరణలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జివి కృష్ణారావు, ఎంపిడిఒ డొంక త్రినాధులు, నగర పంచాయతీ కమిషనర్‌ సర్వేశ్వరరావు, వైస్‌ చైర్మన్‌ హనుమంతరావు, కౌన్సిలర్లు దుప్పాడ పాపినాయుడు, బాసురు కాంతారావు, కిల్లారి మోహన్‌, తూముల లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. సమన్వయం కరువుప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపించింది. ఎంపిడిఒ, నగరపంచాయతీ కమిషనర్‌ మధ్య సమన్వయం కొరవడడంతో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. మీరు నిధులు ఖర్చు పెట్టాలంటే… మీరు నిధులు ఖర్చు పెట్టాలి అంటూ ఒకరిపై ఒకరు నిధుల సమీకరణ నెట్టివేయడంతో క్రీడాకారులు కొంత అసౌకర్యనికి గురయ్యారు. తాగటానికి నీరు కూడా ఏర్పాటు చెయ్యకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పలు విమర్శలు వినిపించాయి.వీరఘట్టం : స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జడ్పిటిసి జంపు కన్నతల్లి- ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. అలాగే చిదిమి, నర్సిపురం, వండువ, తలవరం, బిటివాడ, కంబరవలస జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో క్రీడలు నిర్వహించారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి పి.కిరణ్‌కుమార్‌, ప్రధానోపాధ్యాయులు, పిఇటిలు, సచివాలయ కార్యదర్శులు, క్రీడాకారులు పాల్గొన్నారు.గరుగుబిల్లి : మండలంలోని రావివలసలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు ప్రారంభించారు. కార్యక్రమంలో ట్రైనీ డిఎస్‌పి అజిజ్‌, ఎంపిపి ఉరిటి రామారావు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ మరిశర్ల బాపూజీ నాయుడు, ఎంపిడిఒ జి.పైడితల్లి, ఎఒఎస్‌ అర్జున్‌, ఎంఇఒ నగిరెడ్డి నాగభూషణరావు, సర్పంచ్‌ బి.అప్పడు, వైసిపి నాయకులు రౌతు రామినాయుడు, కె.నరసింగరావు, పెద్దిరెడ్డి శ్రీనివాసరావునాయుడు, చందక వెంకటేష్‌, పాల్గొ న్నారు.

➡️