ఆరోగ్య సురక్షతో పేదలకు పూర్తి స్థాయి వైద్యం

తగరంపూడిలో ఆరోగ్య సురక్ష శిబిరంలో మంత్రి అమర్‌నాథ్‌

ప్రజాశక్తి- అనకాపల్లి

రాష్ట్రంలో పేదవారికి పూర్తిస్థాయిలో వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. మండలంలోని వెంకుపాలెం గ్రామం తగరంపూడి పిహెచ్సి పరిధిలో ఆరోగ్య శిబిరాన్ని మంగళవారం అమర్నాథ్‌ ప్రారంభించారు. శిబిరానికి వచ్చిన రోగులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిపుణులైన డాక్టర్లతో వైద్య పరీక్షలు చేయించడమే కాకుండా, ఉచితంగా మందులు అందించే సౌకర్యం కల్పిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఐడబ్ల్యుఏ చైర్మన్‌ దంతులూరి దిలీప్‌ కుమార్‌, ఎంపీపీ గొర్లి సూరిబాబు, వైసిపి నాయకులు పెద్దిశెట్టి గోవింద, సర్పంచులు రాపేటి నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు రాపేటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.మునగపాక : జగనన్న ఆరోగ్య సురక్షణను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు యువి రమణ మూర్తి రాజు కోరారు. మండలంలోని ఒంపోలు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష-2 కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్‌ యు సుకుమార్‌ వర్మ, ఎంపీపీ మళ్ల జయలక్ష్మి, జడ్పిటిసి పెంటకోట స్వామి సత్యనారాయణ, వైకాపా మండల కన్వీనర్‌ ఆడారి గణపతి అచ్చం నాయుడు పాల్గొన్నారు.బుచ్చయ్యపేట : ప్రజల ఆరోగ్యం వృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. మంగళవారం బుచ్చయ్యపేట మండలం మల్లాం గ్రామంలో నిర్వహించిన రెండో దశ జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో డిపిఓ ఆర్‌.శిరీషా రాణి, వైద్యాధికారిని సంధ్యారాణి, జడ్పిటిసి సభ్యుడు దొండా రాంబాబు, మండల పార్టీ అధ్యక్షుడు జోగా కొండబాబు, వైసీపీ సీనియర్‌ నాయకులు దాకారపు నాగేశ్వరరావు, స్థానిక సర్పంచ్‌ బర్ల శివ, ఎంపీడీవో సువర్ణ రాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.చోడవరం : చోడవరం పంచాయతీ సచివాలయం-3 వద్ద జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. దీర్ఘకాలిక రోగులకు నెల రోజులకు ఒకసారి పడే మందులను ఉచితంగా అందించారు.కోటవురట్ల : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మంగళవారం చౌడవాడలో వైద్య సిబ్బంది నిర్వహించారు. సచివాలయ పరిధిలోని పలువురికి సిహెచ్‌సి వైద్యులు,సిబ్బంది పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో మండల పరిషత్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.ఆనందపురం : జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీలో మంగళవారం భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అన్ని రకాల వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్యం అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ అడపా లవరాజు, తహశీల్దార్‌ లోకవరపు రామారావు, డిహెచ్‌ఎంఒ జగదీశ్వరరావు, నోడల్‌ ఆఫీసర్‌ శ్రీరామ్‌మూర్తి, వైసిపి మండల అధ్యక్షులు బంక సత్యం, జడ్‌పిటిసి కోరాడ వెంకట్రావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మజ్జి వెంకట్రావు, సర్పంచులు లక్ష్మణరావు, చందక లక్ష్మి, కాకర రమణ, పిన్నింటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.పద్మనాభం : పద్మనాభం మండలంలోని అయినాడ గ్రామపంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో వారంలో రెండు రోజులు ఈ కార్యక్రమం జరిగేలా విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రాంబాబు, జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మన్‌ సుంకర గిరిబాబు, మండల వైసిపి అధ్యక్షులు కె.లక్ష్మణరావు, నాయకులు కె.పాపారావు ఎం.శివ రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️