ఆరోగ్య సురక్షతో ప్రయోజనం

ప్రజాశక్తి-శింగరాయకొండ : మండల పరిధిలోని సోమరాజుపల్లి గ్రామంలో జగనన్న ఆరోగ్యవైద్యశిబిరం శుక్రవానం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశిబిరం ఇన్‌ఛార్జి డాక్టర్‌ కె. ధర్మేంద కుమార్‌ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష పథకం పేదల వరం లాంటిందని తెలిపారు. జగనన్న సురక్ష మొదటి విడత రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైనట్లు తెలిపారు. అందులో భాగంగా జగనన్న సురక్ష పేజ్‌-2 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్మవ్యాధుల వైద్యురాలు డాక్టర్‌ జి.కష్ణ కావ్య, నరాలు, ఎముకల వైద్యుడు డాక్టర్‌ కిరణ్‌, కంటి వైద్య నిపుణుడు డాక్టర్‌ జి.వెంకటేశ్వర్లు ఫ్యామిలీ డాక్టర్‌ ఎన్‌. వంశీధర్‌ ఆరోగ్య పర్యవేక్షకులు సయ్యద్‌ మసూద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు. పిసిపల్లి : మండల పరిధిలోని వెంగాళాయపల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 372 మందికి వైద్యపరీక్షలు మందులు అందజేశారు. 20 మందికి కళ్ల అద్దాలు అవసరమని నిర్ధారించారు. ఈ కార్యక్రమంలో పిసిపల్లి ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్‌ యషిత, డాక్టర్‌ ప్రత్యూష్‌కుమార్‌, సిహెచ్‌ఒ కె.లకీëసుజాత తదితరులు పాల్గొన్నారు.

➡️