ఆశాల సమ్మె విరమణ

Dec 1,2023 23:29

అధికారులతో చర్చలు సఫలం
ప్రజాశక్తి -దేవరపల్లి
శీలబోయిన రమాదేవి కుటుంబానికి న్యాయం చేయాలంలో 11 రోజులుగా ఆశావర్కర్లు చేస్తున్న సమ్మె విజయవంతమైంది. అధికారులతో నిర్వహించిన చర్చలు సఫలం కావడంతో వారు సమ్మెను విరమించారు. ఈ సమ్మె శిబిరాన్ని ఎంఎల్‌ఎ షేక్‌ సాబ్జీ సందర్శించి మద్దతు తెలిపారు. అనంతరం దేవరపల్లి ప్రాథమిక ఆసుపత్రికి వచ్చిన డిప్యూటీ డిఎంహెచ్‌ఒతో చర్చలు జరిపారు. సమస్య పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళనలో భాగస్వాములు అవుతావని అధికారులను హెచ్చరించారు. టిడిపి గోపాలపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి మద్దిపాటి వెంకటరాజు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. రమాదేవి తల్లి క్యాన్సర్‌ తో బాధపడుతుందని మానవతా దక్పథంతో అధికారులు స్పందించాలన్నారు. టిడిపి తరఫున రమాదేవి తల్లి అనారోగ్య ఖర్చులు నిమిత్తం రూ.25వేలు అందిస్తామన్నారు. అధికారులు సమస్యను పరిష్కరించ కుంటే టిడిపి తరుపున కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అనంతరం స్థానిక పిహెచ్‌సికి విచ్చేసిన జిల్లా అధికారులతో ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నాయకత్వం చర్చలు జరిపింది. అధికారులు స్పష్టమైన లిఖితపూర్వ హామీని ఇచ్చారు. కృష్ణపాలెం ఆశా వర్కర్‌ పోస్టును అర్హులైన రమాదేవి కుటుంబ సభ్యులకు ఇస్తామని తెలిపారు. హామీలను నెరవేర్చకపోతే మరోసారి ఆందోళనకు సిద్ధమవుతావని యూనియన్‌ నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎపి ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.పోచమ్మ, జిల్లా అధ్యక్షులు కొండేటి అన్నామణి, సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌.భగత్‌, సిఐటియు నాయకులు కె.రత్నాజీ, రైతు సంఘం నాయకులు సత్యనారాయణ, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు మల్లెపూడి వెంకటలక్ష్మి, టి.ఇందిరా, కె.ప్రసన్న ఆశాల సమ్మెకు మద్దతు తెలపారు. ఈ చర్చల్లో డిప్యూటీ డిఎంహెచ్‌ఒ సంధ్య, డిసిఎం అభిషేక్‌, అర్జున్‌, పిహెచ్‌సి మెడికల్‌ ఆఫీసర్‌ సాంబశివరావు పాల్గొన్నారు.

➡️