ఆశా వర్కర్స్‌కు కనీసవేతనాలు చెల్లించాలి : సిఐటియు

Dec 14,2023 14:55 #srikakulam
  • 36 గంటల ధర్నా, వంటావార్పు

ప్రజాశక్తి-శ్రీకాకుళంఅర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్స్‌కు కనీసవేతనాలు చెల్లించాలని, పనిభారాన్ని తగ్గించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు,ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు కే నాగమణి, అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు డి.ధనలక్ష్మి, జి.అమరావతి డిమాండ్‌ చేశారు. ఆశా వర్కర్స్‌కు కనీసవేతనం చెల్లించాలని, పనిభారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సెలవులు, రిటైర్మెంట్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం, సంక్షేమ పథకాలు అమలుచేయాలని, ఆశా నియామకాల్లో రాజకీయ జోక్యం తొలగించాలని, ప్రభుత్వమే నియామకాలు జరపాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్‌ (జ్యోతిబాపూలే పార్కు) వద్ద ఆశా వర్కర్స్‌ 36 గంటల ధర్నా, వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు ప్రారంభించిన ఈ 36 గంటల ధర్నా లో ఆశా వర్కర్లంతా ఇక్కడే ఉంటావార్పు నిర్వహించి భోజనాలు చేసి రాత్రి కూడా ఇక్కడే నిద్రించి రేపు సాయంత్రం వరకు ధర్నా కొనసాగుతుందని అన్నారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి గారు ఆశాల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఆశా వర్కర్స్‌కు కనీస వేతనాలు చెల్లించాలని, పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేశారు.ప్రభుత్వ సెలవులు, రిటైర్మెంట్‌, గ్రూప్‌ న్పూరెన్స్‌ సౌకర్యం, సంక్షేమ పథకాలు అమలుచేయాలని డిమాండ్చేశారు. నియామకాల్లో రాజకీయ జోక్యం తొలగించాలని, ప్రభుత్వమే నియామకాలు జరపాలని, రిటైర్మెంట్‌ కాలాన్ని 62 ఏళ్ళకు పెంచాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించిన తరువాతే రిటైర్మెంట్‌ చెయ్యాలని డిమాండ్‌ చేశారు.గత 18 సంవత్సరాలుగా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి కార్మికులుగా గుర్తించాలని ఇతర సౌకర్యాలను కల్పించాలని డిమాండ్‌ చేశారు. 60 సంవత్సరాలు వయస్సు వచ్చేవరకు పనిచేయించుకొని ఆశావర్కర్కు ప్రభుత్వం రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ సౌకర్యం కల్పించకుండానే తొలగించటం సరైంది కాదని అన్నారు. 62 సంవత్సరాల రిటైర్మెంట్‌ జి.ఓ వర్తింపచెయ్యాలని, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరియు అనారోగ్యంతో చాలా మంది ఆశా వర్కర్లు అర్ధాంతరంగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆశా ‘వర్కర్ల్కు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని కోరారు.గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్న ఆశాలుగా మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు.ఆశావర్కర్స్‌ని రోజు విలేజ్‌ క్లీనిక్‌, సచివాలయాలలో ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలని, క్లినిక్‌ లు క్లీన్‌ చేయటం, ఓపీ వర్క్‌, అటెండర్‌ పనులు చేయించడం తో పాటు ఉదయం సాయంత్రం రెండు సార్లు రిజిస్టర్‌ లో సంతకాలు చేయాలని అధికారులు వేదిస్తున్నారని విమర్శించారు.రికార్డ్స్‌ సొంత డబ్బులు పెట్టి కొనాలని, సంబంధం లేని ఆన్లైన్‌ వర్క్‌ లన్ని సొంత ఫోన్‌ ద్వారా చేయాలని వేధిస్తున్నారని, సెలవులు లేకపోవడంతో అనారోగ్యాలపాలౌతున్నారని అన్నారు. ఆశా వర్కర్లు కు సంబంధం లేని పనులు చేయించటం ఆపాలని డిమాండ్‌ చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆశా వర్కర్స్‌ కనీస వేతనం చెల్లించాలని,కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ ని ఆశాలుగా మార్పు చేయాలనిడిమాండ్‌ చేశారు. పనిభారాన్ని తగ్గించాలని, మొబైల్‌ వర్క్‌ శిక్షణఇవ్వాలని,రికార్డ్స్‌ లేదా ఆన్లైన్‌ ఒక పని ఒకసారి మాత్రమే చేయించాలని డిమాండ్‌ చేశారు. 10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలి. (ఏ కారణంతో మరణించిన), రిటైర్మెంట్‌ జెనిఫిట్స్‌ 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని, 62 సం?ల రిటైర్మెంట్‌ జిఓని వర్తింపచెయ్యాలని,ప్రభుత్వ శెలవులు, మెడికల్‌ లీవ్‌, వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్‌ అమలు చెయ్యాలని డిమాండ్‌ చేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలని, ఇళ్ళు లేని వారికి ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.కోవిడ్‌ కాలంలో (2020 మార్చి నుండి) మరణించిన ఆశాలకు 10 లక్షలు ఎక్స్రేషియో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.మరణించిన కుటుంబంలో అర్హులైన వారిని ఆశాలుగా తీసుకోవాలని, ఎఎన్‌ఎం, హెల్త్‌ సెక్రటరీల నియామకాలలో ఆశాలకు వెయిటేజ్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆశా వర్కర్ల పోరాటానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అల్లు.మహాలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం జిల్లా ఉపాధ్యక్షులు పి.పద్మావతి ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి. సింహాచలం, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ .కిషోర్‌ కుమార్‌ తదితరులు సంఘీభావం తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎపి ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు పి.జయలక్ష్మి, సిహెచ్‌. లక్ష్మి పి.జయలక్ష్మి, ఆర్‌.కాంతమ్మ పి.దమయంతి, ఎస్‌.గౌరమ్మ, కె.జోష్ణ, ఎస్‌.సుశీల,కే.పార్వతి ఎస్‌.కళావతి తదితరులు పాల్గొన్నారు.

➡️