ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌పై అవగాహన

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం

ప్రజాశక్తి- మధురవాడ: స్మార్ట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ తదితర అంశాలపై గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్ధులను అమెరికాలోని ప్రసిద్ద కాన్సాస్‌ స్టేట్‌ యూనివర్సిటీ బల్క్‌ సాలిడ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ దండు రాజు అవగాహన కల్పించారు. సోమవారం గీతం మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిచిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఆయా అంశాల్లో వస్తున్న మార్పులను సమగ్రంగా వివరించారు. అనంతరం విద్యార్ధుల సందేహలను నివృత్తి చేసారు. అనంతరం గీతం ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, ఇతర విభాగాలను సందర్శించారు. గీతం విశ్వవిద్యాలయం విద్యార్ధులకు మేధో సహకారాన్ని అందస్తామని భరోసానిచ్చారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ నాగేంద్రప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డీన్‌ ప్రొఫెసర్‌ విజయశేఖర్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ అధిపతి ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ జివిఆర్‌.శర్మ పాల్గొన్నారు.

అమెరికన్‌ నిపుణుడు ప్రొఫెసర్‌ రాజును సత్కరిస్తున్న గీతం ప్రతినిధులు

➡️