ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం

ప్రజాశక్తి – రాయచోటి జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు 1వ తేదీ నుండి ఈ నెల 20వ తేదీ వరకు, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించునున్నారు. ఒక నిమషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించమనే అధికారులు చెప్పడంతో విద్యార్థులందరూ 30 నిమిషాలు ముందుగా హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు భాష పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 12,364 మంది విద్యార్థులు ఉండగా 11,756 మంది హాజరు కాగా 608 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్‌ 11,345 మొత్తం విద్యార్థులు ఉండగా 10,819 మంది హాజరు కాగా 535 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ కోర్స్‌లో 1010 మంది మొత్తం విద్యార్థులు ఉండగా 937 మంది విద్యార్థులు హాజరుకాగా 73 మంది గైర్హాజరయ్యారు. రాయచోటి పట్టణంలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1908 మంది విద్యార్థులు ఉండగా 1826 మంది హాజరుకాగా 82 మంది గైర్హాజరయ్యారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఆఫీసర్లు 54, అడిషనల్‌ స్టాప్‌ సూపరింటెండెంట్‌ 26, ప్లేయింగ్‌ స్క్వాడ్‌ ముగ్గురు, 1065 ఇన్విజి లెటర్లును ఏర్పాటు చేశారు. పరీక్ష జరిగే సమయంలో గ్రామీణ ప్రాంతాలలో ఉదయం, మధ్యాహ్నం ఆర్టీసీ బస్సును, పరీక్ష సమయంలో విద్యుత్‌ అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రతి సెంటర్‌లో ఎఎన్‌ఎం, తాగునీరు, మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేశారు. జిరాక్స్‌ సెంటర్‌ను మూసి వేయించారు. సెల్‌ ఫోన్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులను నిషేధించారు. వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.పలు పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి కష్ణయ్య పరిశీలించారు.

➡️