ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం ప్ర

జాశక్తి – కడప అర్బన్‌ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు అధికారులు సర్వసిద్దం చేశారు. ఈనెల ఒకటి నుంచి పరీక్షలు ప్రారంభమై 20న ముగుస్తాయి. 152 కళాశాలల నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులు 16,177 మంది హాజరు కానున్నారు. ద్వితీయ సంవత్సరానికి విద్యార్థులు 13,765 మంది హాజరు కానున్నారు. వీరి కోసం 69 సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్షలు పకడ్భందీగా నిర్వహించేందకు 1,095 సిసి కెమెనాలు ఏర్పాటు చేయనున్నారు. 1,205 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. 3 ఫ్లైయింగ్‌ స్వ్కాడ్స్‌ సెంటర్లకు తిరుగుతూ పరీక్షల తీరును పర్యవేక్షిస్తారు. ఇందులో డిప్యూటీ తహశీలార్దు, ఆర్‌ఎస్‌ఎఫ్‌, ఎస్‌ఐ లేక ఎఎస్‌ఐ స్థానికంగా జూనియర్‌ లెక్చరర్‌ ఉంటారు. ఇద్దరు సిటింగ్‌ స్వ్కాడ్‌ సెంటర్ల్లలో ఉంటారు. వీరితో పాటు డివిఒ, ఆర్‌ఐఒ, డిఇసి వాహనాల్లో తిరుగుతూ రోజుకు 20,25 సెంటర్లను తనిఖీ చేస్తారు. ప్రతి సెంటర్లలో ఒక ఎఎన్‌ఒను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి సెంటర్‌లో విద్యార్థులకు బల్లలు, తారునీరు, విద్యుత్‌, ఫ్యాన్‌ సౌకర్యం ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటలకు వరకు ఉంటాయి. మొదటి సంవత్సరం పరీక్షలు.. మార్చి 1, 2 తేదీల్లో లాంగ్‌వేజ్‌, 4న ఇంగ్లీష్‌, 6న 1ఎ-లెక్కలు, బాటని, సివిక్స్‌. 9న 1-బి లెక్కలు, జువాలజి, హిస్టరీ. 12న ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌.14న కెమిస్ట్రి, కామర్స్‌, సోషియాలజీ, ఫైన్‌ఆర్ట్స్‌ మ్యూజిక్‌, 16న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, బ్రిడ్జికోర్స్‌ లెక్కలు (బైపిసి విద్యార్థులకు). 19న మోడ్రన్‌ లాంగ్వేజ్‌, జాగ్రఫీ పరీక్షలు ఉంటాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు 2న 2 లాంగ్‌వేజ్‌, 5న ఇంగ్లీష్‌, 7న 2-ఎ లెక్కలు, బాటని, సివిక్స్‌, 11న లెక్కలు 2-బి, జువాలజి, హిస్టరీ, 13న ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌. 15న కెమిస్ట్రీ, కామర్స్‌, సోషియాలజీ, ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌. 18న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేన్‌, బ్రిడ్జికోర్సు లెక్కలు-2 (బైపిసి విద్యార్థులకు). 20న మోడ్రన్‌ లాంగ్వేజ్‌, జాగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు.

➡️