ఇంటింటా ‘ఇంటూరి’ ప్రచారం

Dec 14,2023 18:12
ప్రచారం నిర్వహిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రచారం నిర్వహిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు
ఇంటింటా ‘ఇంటూరి’ ప్రచారం
ప్రజాశక్తి-కందుకూరు బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కందుకూరు పట్టణంలోని 6వ వార్డులో టిడిపి కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటింటా ప్రచారం చేశారు. ఉదయం 6 గంటల నుంచే పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడంతో పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో పెరిగిన ధరలు, చార్జీలు, దోపిడి, అక్రమ కేసులు గురించి నాగేశ్వరరావు వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే, మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా, పథకాలు ప్రవేశపెట్టి, చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతారని హామీ ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భతి, రైతులకు ఆర్థిక సహాయం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బీసీలకు రక్షణ చట్టం పథకాలను అంకెలతో వివరిస్తూ నాగేశ్వరరావు షఉరిటీ బాండ్లను అందజేశారు. జగన్మోహన్‌ రెడ్డి చేతకాని పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనమైన సంగతిని స్థానికులకు తెలియజేస్తూ.. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని ు కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు సయ్యద్‌ అహ్మద్‌ బాషా, వార్డు నాయకులు షేక్‌ ఫిరోజ్‌, షేక్‌ మున్నా, షేక్‌ మియాజాన్‌, షేక్‌ దావూద్‌ బాషా, సయ్యద్‌ సమద్‌, షేక్‌ ఆరిఫ్‌, షేక్‌ నాయబ్‌ రసూల్‌, సయ్యద్‌ అహ్మద్‌, షేక్‌ రియాజ్‌, షేక్‌ సలీం, సయ్యద్‌ మీరామోహిద్దీన్‌, సయ్యద్‌ హుస్సేన్‌ షేక్‌ హుస్సేన్‌, షేక్‌ కలీమా, రెబ్బవరపు మాల్యాద్రి,చల్లా హారిబాబు నాయకులు చిలకపాటి మధుబాబు, షేక్‌ రఫీ, వడ్డెళ్ల రవిచంద్ర, బెజవాడ ప్రసాద్‌, గోచిపాతల మోషే, రాయపాటి శ్రీనివాసరావు, పొడపాటి మహేష్‌, చుండూరి శీను, షేక్‌ సలాం, సయ్యద్‌ జియావుద్దీన్‌, రూబీ, గౌస్‌ బాషా, కరిముల్లా, ముచ్చు వేణు పులి నాగరాజు, ఫాజిల్‌, చంటి, బద్దిపూడి శిఖామణి, మమ్ముషా, వేముల ప్రసాద్‌, ముప్పవరపు వేణు గుమ్మ శివ, మచ్చ మనోహర్‌ ఇతర నాయకులు పాల్గొన్నారు.

➡️