ఇంటింటా నారాయణ ప్రచారం

Dec 31,2023 20:51
ప్రచారం చేస్తున్న నారాయణ

ప్రచారం చేస్తున్న నారాయణ
ఇంటింటా నారాయణ ప్రచారం
ప్రజాశక్తి – నెల్లూరు సిటీ వైసిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్రాలో బ్రిటీష్‌ పాలన కన్నా ఘోరంగా పాలన సాగుతోందని, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి, నగర టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొంగూరు నారాయణ విమర్శించారు. నెల్లూరు నగరంలోని 6వ డివిజన్‌ ఉడ్‌ హౌస్‌ సెంటర్‌ తదితర ప్రాంతాల్లో బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. డివిజన్‌ నాయకులు, కార్యకర్తలు, మహిళలు వారికి ఘన స్వాగతం పలికారు. టిడిపి ప్రభుత్వం చేపట్టిన అభివద్ధిని తెలియజేస్తూ…వైసీపీ అరాచకాలను వివరించారు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనీల్‌కుమార్‌ యాదవ్‌కు దమ్ముంటే నెల్లూరు నగరం నుంచి పోటీ చేయాలని సవాల్‌ విసిరిరారు. నగర అధ్యక్షుడు మామిడాల మధు,6వ డివిజన్‌ అధ్యక్షుడు కొండ ప్రవీణ్‌, డివిజన్‌ ఇన్‌ఛార్జి పూర్ణ,జనరల్‌ సెక్రటరీ సాయి,యూనిట్‌ ఇన్‌ఛార్జి నరహరి, రామకష్ణ, బూత్‌ కన్వీనర్‌ రవి,రాజేశ్వరి ఉన్నారు.

➡️