ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభం

Dec 18,2023 19:53
ర్యాలీని ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ మహీధర్‌రెడ్డి

ర్యాలీని ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ మహీధర్‌రెడ్డి
ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభం
ప్రజాశక్తి-కందుకూరు : ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా కందుకూరు విద్యుత్‌ ఆఫీస్‌ సెంటర్లో సోమవారం ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి జెండా ఊపి ర్యాలీ ప్రారం భించారు. విద్యుత్‌ దుబారాను తగ్గించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియ జేసేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని ఎంఎల్‌ఎ తెలిపారు. విద్యుత్‌ను ఆదా చేసుకోవాల్సిన అవసరముందన్నారు. కందుకూరు డివిజనల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ వీరయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు యుగంధర్‌ విజయ బాబు, అసిస్టెంట్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ వెంకటరామయ్య, అసిస్టెంట్‌ ఇంజనీర్లు ఏ ఈ నరసింహం ఉన్నారు.

➡️