ఇదే స్ఫూర్తితో మరిన్ని బాలోత్సవాలు నిర్వహించాలి

అభినందన సభలో మాట్లాడుతున్న వి.కృష్ణయ్య
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు బాలోత్సవం కమిటీ 65 ఈవెంట్లలో జిల్లాస్థాయిలో బాలబాలికలకు ఈనెల 23, 24 తేదీలలో బాలోత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు పల్నాడు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ కమిటీ అభినందనలు తెలియజేసింది. ఈ మేరకు అభినందన సభ ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాలలో మంగళవారం నిర్వహించగా పల్నాడు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ చైర్మన్‌ గుంటూరు విజరు కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షులు వి.కృష్ణయ్య, పల్నాడు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ సభ్యులు పాల్గొన్నారు. సభకు పల్నాడు బాలోత్సవం కమిటీ ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో ఇంతపెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహి ంచడం గొప్ప విషయమన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లోనూ నిర్వహించాలని కోరారు. పోటీలను జయప్ర దంగా నిర్వహించడానికి సహకరించిన బాలోత్సవం కమిటీ సభ్యులు రాజారెడ్డి, కట్ట కోటేశ్వరరావు, గౌస్‌ మొహిద్దిన్‌, నిర్వాహకులను అభినందించారు. సభలో విశ్రాంత హెచ్‌ఎం ప్రసాదు, ఎం.సాంబశివరావు, కె.శ్రీనివాసరావు, జిఎస్‌ఆర్‌, కస్తూర్బా స్కూల్స్‌ జిల్లా అధికారి డి.రేవతి, పల్నాడు విజ్ఞాన కేంద్రం సభ్యులు షేక్‌ మస్తాన్‌వలి, ఎ.గోపాలరావు, వై.రాధాకృష్ణ, ఎస్‌.ఆంజనేయ నాయక్‌, జి.రవిబాబు, ఎ.లక్ష్మీశ్వర్‌రెడ్డి, కె.రామారావు పాల్గొన్నారు.
సహకరించిన అందరికీ కృతజ్ఞలు : కట్టా కోటేశ్వరరావు
ఇదిలా ఉండగా బాలోత్సవాన్ని జయప్రదం చేసినందుకు కమిటీ సభ్యులకు కమిటీ కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. రెండ్రోజులపాటు నిర్వహించిన పోటీలకు 15 వేల మంది హాజరయ్యారని, వివిధ ఈవెంట్స్‌లో 7700 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. మూడు విభాగాలకు (సబ్‌ జూనియర్‌, జూనియర్‌,సీనియర్‌) సంబంధించి మొదటి రోజు 4300 మంది, రెండవ రోజు 3400 మంది పాల్గొన్నారని పేర్కొన్నారు. న్యాయ నిర్ణేతలుగా 40 మంది, ఆర్గనైజర్స్‌గా 65 మంది, వాలంటీర్స్‌గా 60 మంది, ఈవెంట్‌ ఏర్పాట్లలో మరో 60 మంది, ఆహ్వానితులు మరో 40 మంది మొత్తం 265 మందికిపైగా పోటీల నిర్వహణలో పాలుపంచుకున్నారని వివరించారు. వివిధ విభాగాల్లో మొత్తం 65 అంశాల్లో పోటీలు నిర్వహించగా ప్రతి విభాగంలోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు రెండు కన్సొలేషన్‌ బహుమతులు ప్రదానం చేసినట్లు తెలిపారు. గ్రూప్‌ ఈవెంట్స్‌లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులను పాఠశాలకు పంపుతామని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న అందరికీ పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు ఇచ్చామని పేర్కొన్నారు. ‘పల్నాడు బాలోత్సవం’ పిల్లల పండుగ నిర్వహణలో ఆర్గనైజర్స్‌గా వ్యవహరించిన కమిటీ గౌరవాధ్యక్షులు ఎం.ఎస్‌.ఆర్‌.కె ప్రసాద్‌, అధ్యక్షులు ‘ఆక్స్‌ఫర్డ్‌’ రాజారెడ్డి, కోశాధికారి కోయ రామారావు, ఎస్‌సిఇఆర్‌టి టెస్ట్‌ బుక్‌ రైటర్‌ షేక్‌ మహమ్మద్‌ గౌస్‌, కమిటీ ప్రధాన బాధ్యులు మేడా సాంబశివరావు, ఎ.భాగేశ్వరిదేవి, ఎ.లక్ష్మీశ్వరరెడ్డి, జిఎస్‌ఆర్‌కు, సహకరించిన దాతలకు, అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, న్యాయ నిర్ణేతలకు, వాలంటీర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

➡️