ఇన్నోవేటివ్‌ ఆలోచనలతోనే రాణింపు

ఎఎన్‌యు: నేటి ఆధునిక ప్రపంచంలో ఇన్నోవేటివ్‌ ఆలోచనలు ఉంటేనే ఏ రంగమైన ముందుకు సాగుతుందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ మాజీ వైస్‌ ఛాన్స లర్‌ ప్రొఫెసర్‌ కె.వి రావు అన్నారు. వర్సిటీలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ఆధ్వర్యంలో ఎమర్జింగ్‌ గ్లోబల్‌ ఎకానమీ కామర్స్‌ అండ్‌ మేనేజ్మెంట్‌ ఛాలెంజెస్‌ అండ్‌ స్ట్రాటజీస్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కాంపిటీటివ్‌ నెస్‌ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు సెమినార్‌ డైరెక్టర్‌ బట్టు నాగరాజు అధ్యక్షత వహించారు. కీలకోపన్యాసకులుగా పాల్గొన్న కె.వి. రావు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో వ్యాపారాత్మక ధోర ణికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌, ఇంట ర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొ న్నారు. అయితే ఇన్నోవేటివ్‌ ఐడియాలతో ముందుకు సాగాల్సిన తరుణంలో వ్యాపారాల అభివృద్ధిని మూస పద్ధతిలోనే కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా ఆర్థిక రంగంబలోపేతం కష్టమవుతుందని అన్నారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచ విపత్తుగా మారిన కరోనా తరువాత నిదానంగా కోలుకుంటున్నా.. ఆర్థిక రంగానికి నూతన జవసత్వాలు తీసుకువచ్చేందుకు కొత్త కొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణల అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్లోబల్‌ ఎకానమీకి సంబంధించి మార్పులు వస్తున్న తరుణంలో విద్యార్థులు కూడా నూతన కరికులమ్‌, ప్రపంచ పోకడలకు తగ్గట్లుగా మెలకువలు పెంచుకోవాలన్నారు. మార్పులకు అనుగుణంగానే ఏదైనా సాధ్యం చేసుకునే వీలును పరిశీలించాలన్నారు. కొత్త కొత్త ఆలోచనల తో ముందుకు సాగాలని ప్రపంచ గమనంపై భారత ఆర్థిక స్థితిని బలోపేతానికి విద్యార్థులు నూతన ఆవిష్కరణ వైపు పయనించాలన్నారు. చీఫ్‌ ప్యాట్రన్‌ గా పాల్గొన్న ఏఎన్యూ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ పట్టేటి రాజశేఖర్‌ మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు వస్తూనే ఉన్నాయని దానికంటే ముందుగా దేశ అంతర్గత ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేసు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సదస్సు డైరెక్టర్‌ నాగరాజు మాట్లా డుతూ సదస్సుకు అనూహ్య స్పందన లభించిం దన్నారు. సదస్సులో రెక్టార్‌ ప్రొఫెసర్‌ పి .వరప్రసాద్‌ మూర్తి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బీ .కరుణ, సిడిసి డిన్‌ ప్రొఫెసర్‌ కె. మధుబాబు, కామర్స్‌ విభాగం అధ్యా పకులు ప్రొఫెసర్‌ శివరాం ప్రసాద్‌, డాక్టర్‌ రత్న కిషోర్‌, డాక్టర్‌ కె. సుధీర్‌ కుమార్‌, డాక్టర్‌ జి.నాగరాజు, డాక్టర్‌ విష్ణు, చంద్రభాను రెడ్డి, డాక్టర్‌ కనపర్తి అబ్రహం లింకన్‌ పాల్గొన్నారు.

➡️