నలుగురు నిందితులు అరెస్టు

Dec 14,2023 20:08
వివరాలు వెల్లడిస్తున్న దృశ్యం

వివరాలు వెల్లడిస్తున్న దృశ్యం
నలుగురు నిందితులు అరెస్టు
ప్రజాశక్తి – వలేటివారిపాలెం మండల పరిధిలో గత నెల 27న హెరిటేజ్‌ సమీపంలో జరిగిన దారి దోపిడీ గొలుసు దొంగల ఆటను వలేటివారిపాలెం పోలీసులు కట్టించారు. నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల మేరకు గత నెల 27న మండల పరిధిలోని బడేవారిపాలెం గ్రామానికి చెందిన మువ్వా మాల్యాద్రి తన భార్యతో కలిసి కందుకూరు నుంచి తన స్వగ్రామానికి వస్తున్న సమయంలో హెరిటేజ్‌ సమీపంలో రెండు బైక్‌లపై వచ్చిన యువకులు వారిని అడ్డగించి గాయపరిచి గొలుసు అపహరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో డిఎస్‌పి రామచంద్ర పర్యవేక్షణలో గుడ్లూరు సిఐ సుబ్బారావు, ఎస్‌ఐ మహేంద్రనాయక్‌ సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. నిందితులను ఈనెల 13 న అదుపులోకి తీసుకున్నారు. పొన్నలూరు మండలం వేపగుంట గ్రామానికి చెందిన వంశీ ప్రధాన నిందితుడుగా తేల్చారు. గతంలో ఇతనిపై అనేక కేసులు ఉన్నాయి. సింగరాయకొండలో ఉంటున్న పవన్‌ కళ్యాణ్‌ డబ్బు కొట్టు కోటయ్య, గంజి సాయి కష్ణ, నలుగురు ఒక ముఠాగా ఏర్పడి వ్యసనాలకు బానిసలై దోపిడీలకు పాల్పడుతున్నారు. వీరి నుంచి సుమారు 5 లక్షల సొత్తు స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రత్యేకంగా దష్టి సారించి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులను ఎస్‌పి తిరుమలేశ్వరరెడ్డి, డి.ఎస్‌.పి రామచంద్ర అభినందించారు.

➡️