ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేయాలి.. సిపిఎం 24 గంటలు నిరసన దీక్ష

Feb 18,2024 15:16 #Ch Baburao, #Vijayawada

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ : వాంబే కాలనీ 60 డివిజన్‌ వాసులకు డిస్నీలాండ్‌ స్థలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి డిస్నీలాండ్లో కబేలా ఏర్పాటు చేయడాన్ని నిలిపి వేయాలని, వాంబే కాలనీ నుండి దేవినగర్‌ వైపు వెళ్లే రైల్వే ట్రాక్‌పై అండర్‌ పాస్‌ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి అనే డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానికులు 24 గంటల దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షను సిపిఎం రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి సిహెచ్‌ బాబూరావు ప్రారంభించి మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్‌ రాకముందే అందరికీ ఉచితంగా పట్టాలు ఇవ్వాలని లేదా గజం ఐదు రూపాయలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గతంలో టిడిపి ప్రభుత్వం రూ.500లకు పైన డబ్బులు వసూలు చేసి పట్టాలు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా పట్టాలు ఇస్తామని చెప్పి మాట తప్పుతుందన్నారు. డిస్నీల్యాండ్‌ స్థలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. అక్కడ కబేలు ఏర్పాటు చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డి కాశీనాథ్‌ మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల పోరాడి సింగ్‌ నగర్‌ రైలు కట్ట మొదలుకొని కండ్రిక వరకు అందరికీ రిజిస్ట్రేషన్‌ పట్టాలి ఇప్పించారన్నారు. సిపిఎం నేత సిహెచ్‌ బాబురావు కార్పొరేటర్‌ ఉండగా పైపుల రోడ్డు దగ్గర నుండి కండ్రిక వరకు 15 రూపాయలకే గజం చెప్పున రిజిస్ట్రేషన్‌ చేయించామని బ్యాంక్‌ అప్పులతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్‌ పట్టాలు ఇప్పించామన్నారు. వైసిపి ప్రభుత్వం మాత్రం పట్టాలు విషయంలో ఆలస్యం వహిస్తుందన్నారు. సిపిఎం రాష్ట్ర సీనియర్‌ నాయకులు డివి కృష్ణ మాట్లాడుతూ సిపిఎం అనేక సమస్యలపై పోరాటం చేసి పరిష్కారించిందన్నారు. రాబోవు శాసనసభ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కే.శ్రీదేవి, జిల్లా కమిటీ సభ్యులు భూపతి రమణారావు, సెంట్రల్‌ సిటీ అధ్యక్షులు కే దుర్గారావు, డివిజన్‌ కార్యదర్శి ఎస్‌ కే పేరు, డివిజన్‌ నాయకులు ఏం బాబురావు, డి కాలేశ్వరం, రత్నకుమారి, జై కళ్యాణ్‌, శ్రీను, మహేష్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

➡️