ఇసుక అక్రమతవ్వకాలను ఆపాలి

Feb 24,2024 21:37
ఫొటో : మాట్లాడుతున్న టిడిపి నాయకులు

ఫొటో : మాట్లాడుతున్న టిడిపి నాయకులు
ఇసుక అక్రమతవ్వకాలను ఆపాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని, లేని పక్షంలో టిడిపి ఆందోళన చేపడుతుందని ఆత్మకూరు టిడిపి నాయకులు పేర్కొన్నారు. శనివారం టిడిపి పిలుపుమేరకు ఆత్మకూరు రూరల్‌ మండలంలోని అప్పారావుపాలెం గ్రామ సమీపంలో ఉన్న ఇసుక రీచ్‌ వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంతో టిడిపి నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ ఇసుకను అక్రమంగా దొంగ బిల్లులతో చలామణి చేస్తూ ఇసుకను పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటూ కోట్ల రూపాయలను దోచుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగడుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆత్మకూరు రూరల్‌ టిడిపి అధ్యక్షులు సుంకర పెంచలచౌదరి, ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, మాజీ తెలుగు ఉపాధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, టిడిపి సీనియర్‌ నాయకులు తోడేటి వెంకటయ్య, పయ్యావుల మారుతినాయుడు, శేషారెడ్డి, అప్పారావుపాలెం గ్రామస్తులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️