ఉచిత వైద్యశిబిరాల నిర్వహణ అభినందనీయం

ప్రజాశక్తి-రాజోలు

ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించడం అభినందనీయమని, పేదలు ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ఉపయోగకరమని రాజోలు ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాదరావు అన్నారు. గురువారం రాజోలు మండలం తాటిపాకలో సోమిశెట్టి ల్యాండ్‌ మార్క్‌ వద్ద శ్రీ సత్యసాయి సేవా సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రాజోలు ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాదరావు, పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో 546 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

 

➡️