ఉత్తరకాశి రెస్క్యూ ఆపరేషన్‌లో శ్రీసిటీ బి-రోలెక్స్‌

Nov 29,2023 21:31
ఉత్తరకాశి రెస్క్యూ ఆపరేషన్‌లో శ్రీసిటీ బి-రోలెక్స్‌

ఉత్తరకాశి రెస్క్యూ ఆపరేషన్‌లో శ్రీసిటీ బి-రోలెక్స్‌ప్రజాశక్తి – వరదయ్యపాలెం ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారీ సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు మంగళవారం రాత్రి ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. 17రోజుల పాటు అవిశ్రాంతంగా సాగిన పలు సంస్థల సంయుక్త సహాయక చర్యల్లో శ్రీసిటీలోని బి-రోలెక్స్‌ పరిశ్రమ కీలకమైన సాంకేతిక సహకారాన్ని అందించినందుకు శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి అభినందనలు తెలిపారు. డిఆర్‌డిఒ మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌రెడ్డి వివిధ నిపుణుల ఏజెన్సీలను సంప్రదించగా బి-రోలెక్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై.శ్రీనివాస్‌రెడ్డి ప్లాస్మా ఆధారిత కటింగ్‌ను అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా ప్రతిపాదించారు. గంటల వ్యవధిలోనే మిషన్లను సిద్ధం చేసి సంతోష్‌కుమార్‌, అజరుషా, నాగరాజులను ఘటనా స్థలానికి పంపారు. విజయవంతంగా కట్టర్‌ నిపుణులు పైప్‌లైన్‌ను సిద్ధం చేసి, కొన్ని గంటల వ్యవధిలో సహాయక చర్యలకు అడ్డుపడిన యంత్రపు ముక్కలను తొలగించారు. సొరంగం వద్ద అడ్డుపడిన యంత్రపు ముక్కలను తొలగిస్తున్న బి-రోలెక్స్‌ కార్మికులు

➡️