ఉత్సాహంగా.. పిల్లల పండగ

పల్నాడు జిల్లా: ప్రస్తుత ఆధునిక యుగంలో బాల బాలికల్లో ఆటపాటలు కార్యక్రమాలు కను మరుగై యాంత్రికంగా తయారవు తున్నా రని పల్నాడు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ చైర్మన్‌ గుంటూరు విజరుకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పల్నాడు రోడ్డులో పాలడుగు నాగయ్య చౌదరి కొత్త రఘు రామయ్య కళాశాలలో పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న పల్నాడు బాలోత్సవం పిల్లల పండుగ రెండో రోజు పోటీలు ఆదివారం జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న విజరు కుమార్‌ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన పల్నాడు జిల్లా అభివృద్ధి చెందాలంటే జిల్లాలో నెలకొన్న అసమానతలు తొల గాలని,జిల్లా సమగ్ర అభివద్ధి సాధించాలనే ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో భాగం గానే ఈ బాలోత్సవం భారీ స్థాయిలో నిర్వ హించామన్నారు. కళలకు, వనరులకు, ఉపాధి అవకాశాలకు కొదవలేని పల్నాడు జిల్లా పాలకుల నిర్లక్ష్యం కారణంగానే వెనక బడిందని ప్రజల అవసరాలు తీరడం లేదని వీటిని సాధించాలంటే మేధావులు, సంఘ సంస్కర్తలు అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. బాల బాలికలు ప్రతిరోజు చదువు ఆట పాటలతోపాటు గ్రంథాలయాల్లో పుస ్తకాలను అధ్యయనం చేయాలని సూచిం చారు.

 

బాలోత్సవాల కార్యక్రమాలకు ముగింపు అంటూ ఏమీ లేదని రానున్న రోజుల్లో విరివిగా కార్యక్రమాలు కొన సాగిస్తామని చెప్పారు. భవిష్యత్తులో పల్నాడు ప్రాంతం సమగ్రాభివృద్ధి సాధిం చేందుకు విజ్ఞాన కేంద్రం తన వంతు కృషి చేస్తుందని చెప్పారు. ఆయా పోటీలలో ప్రతిభ చాటిన బాల బాలికలకు పల్నాడు విజ్ఞాన కేంద్రం మెమంటో, ప్రశంసా పత్రం, మెడల్స్‌ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బాలోత్సవం పిల్లల పండుగ కమిటీ అధ్యక్షులు రాజారెడ్డి కార్యదర్శి కట్ట కోటేశ్వరరావు,సహాయ కార్యదర్శి అనుముల లక్ష్మీశ్వర్‌రెడ్డి, కోశాధికారి కోయా రామారావు విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు కామినేని రామారావు మాటా ్లడారు. పోటీలను తిలకించేందుకు హాజరైన పల్నాడు విజ్ఞాన కేంద్రం నిర్మాణ కమిటీ కన్వీనర్‌ గద్దె చలమయ్య పల్నాడు బాలోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన కమిటీ సభ్యులకు అభినంద నలు తెలిపారు. లఘు నాటికలు, జానపద నృత్యం, పాటలు, స్పెల్బీ, ప్రాజెక్ట్‌ పని, రం గ వల్లులు, కోలాటం ,విచిత్ర వేష ధారణ, మెమొరీ టెస్ట్‌ ,వక్తృత్వం , కథలు చెప్పడం, బుర్రకథ, మట్టితో బొమ్మల తయారీ, పేపర్‌ క్రాఫ్ట్స్‌ తదితర పోటీల్లో విద్యా ర్థులు పాల్గొన్నారు.

 

వేల్పూర్‌ విద్యార్థులకు బహుమతుల పంట

వినుకొండ: పల్నాడు బాలోత్సవం లో మొత్తం 11 బహుమతులను శావల్యాపురం మండలం వేల్పూరు విద్యార్థులు సాధించినట్లు హెచ్‌ఎం సుభాని తెలిపారు. ఏకపాత్రాభినయంలో సీనియర్‌ విభాగంలో స్వామి వివేకానంద, జూనియర్‌ విభాగంలో మర్రి శ్రీవల్లి మైమ్‌ లో స్వామి వివేకానంద కి ప్రథమ బహుమతులు లభించినట్లు తెలిపారు. సీనియర్‌ కోలాటం విభాగంలో 32 టీములు పాల్గొనగా వేల్పూరు విద్యార్థులకు ద్వితీయ బహుమతి లభించినట్లు తెలిపారు. అలాగే సీనియర్‌ మ్యాజిక్‌ లో రెడ్డి హేమంత్‌ జూనియర్లో మరిj బాబులకు ద్వితీయ బహుమతులు లభించినట్లు పేర్కొన్నారు. సుబ్ర హ్మణ్యం, తేజ ,సాయి, చైతన్య శ్రీ, జయ శ్రీ ,శ్రావణి, మేరీ, రోహిణి, రమ్య, మనీషా, హారిక, త్రిష ,లక్ష్మి, అనూష, అశ్విని, తులసి, శివ పార్వతి, హేమ లత, అదా ఆఫీస్‌, సంధ్య లోహిత తిరుమల గాయత్రి పార్ధు వివేక్‌ సాయి కృష్ణ విద్యార్థులకు లఘ నాటిక క్విజ్‌ లో బహుమతులు పొందినట్లు హెచ్‌ఎం తెలిపారు.

➡️