ఉత్సాహంగా వాలీబాల్‌ పోటీలు

Jan 13,2024 20:44

 ప్రజాశక్తి-కొత్తవలస :  వసంత విహార్‌ యూత్‌, ఎఫ్‌టిపి న్యూస్‌ చైర్మన్‌ విశ్వనాథ హరికుమార్‌ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్‌ పోటీలు శుక్రవారం రాత్రి ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎమ్మెల్సీ రఘువర్మ, వసంత విహార్‌ అధినేత వల్లూరి జయప్రకాశ్‌బాబు పోటీలను ప్రారంభించారు. సుమారు 22 జట్లు పాల్గొన్నాయి. విశాఖ పోర్ట్‌ వాలీబాల్‌ కోచ్‌ గండి మారయ్య, హరికుమార్‌ పోటీలను పర్యవేక్షించారు. గులివిందాడ, వడ్డిపేట, దెందేరు జట్లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. వీరికి నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు కర్రి సూర్య నూకరాజు, వసంత విహార్‌ కమిటీ అధ్యక్షులు ఆర్‌.వి.రావు, తదితరులు పాల్గొన్నారు.లింగాలవలసలో క్రికెట్‌ టోర్నమెంట్‌ రేగిడి : మండలంలోని పెద్ద లింగాలవలసలో ఆ గ్రామానికి చెందిన యూత్‌ ఆధ్వర్యంలో శనివారం క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌లో 21 జట్లు వచ్చినట్లు నిర్వాహుకులు తెలిపారు. బెస్ట్‌ ఆఫ్‌ త్రీ విధానంతో క్రికెట్‌ ఆడిస్తున్నారు. గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా ట్రోఫీతో పాటు ఐదు వేల రూపాయలు నగదు, రెండవ బహుమతిగా ట్రోఫీతో పాటు మూడు వేల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి కన్సిలేషన్‌ బహుమతులు కూడా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు నెల్లి రామకృష్ణ, కోడి అప్పలనాయుడు, రామకృష్ణ, నాగరాజు, వెంకటేష్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️