ఉద్యోగాలకు విద్యార్థులు ఎంపిక

ప్రజాశక్తి-వేటపాలెం: క్యూ స్పైడర్‌ యంత్ర సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి పదిమంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ ఎన్‌విఎస్‌ఆర్‌ పవన్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం క్యూ స్పైడర్‌ యంత్ర యూనిట్‌ చీరాల ఇంజినీ రింగ్‌ కళాశాలను సందర్శించింది. ఈ డ్రైవ్‌లో మొత్తం 10 మంది బీటెక్‌ చివరి సంవత్సరం విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రిన్సిపాల్‌ పవన్‌ కుమార్‌, శిక్షణ, ప్లేస్‌మెంట్‌ అధికారి రవివర్మ ఎంపికైన విద్యార్థులను అభినందించారు.

➡️