ఉద్యోగులను వంచించిన జగన్‌ సర్కార్‌ : యుటిఎఫ్‌

Jan 19,2024 21:16

ప్రజాశక్తి – కడప అర్బన్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు బాకీపడ్డ ఆర్థిక బకాయిల చెల్లింపులో అలసత్వం వీడాలని, ఐఆర్‌ 30శాతం పిఆర్‌సి విధివిధానాలు, పాత పెన్షన్‌ విధానం ప్రకటించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాళెం మహేష్‌ బాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం యుటిఎఫ్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహావీర్‌ సర్కిల్‌ నుంచి కలెక్టర్‌ కార్యాల యం వరకు ‘చెవిలో పువ్వులతో’ ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల కు జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పారు. ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ చూపి స్తోందని ఉపాధ్యాయుల పట్ల వివక్ష చూపిస్తూ వారికి న్యాయ బద్ధంగా రావాల్సిన ఆర్థిక బకాయిలను అందించకుండా కక్షపూరి తంగా వేధింపు ధోరణితో ముందుకు వెళ్లడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ట్రెజరర్‌ నరసింహారావు, జిల్లా కార్యదర్శులు ఎ.శ్రీనివాసులు, ఏజాస్‌ అహ్మద్‌, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ప్రభాకర్‌, సిపిఎస్‌ కో-కన్వీనర్‌ అయ్యవారు రెడ్డి, నాయకులు శ్రీనివాసరెడ్డి, గాజులపల్లె గోపీనాథ్‌, పోతురాజు చంద్రశేఖర్‌, శివశంకర్‌, సమీర్‌ బాష, బత్తుల చంద్రశేఖర్‌,కిరణ్‌ కుమార్‌,మురళీధర్‌ రాజు, హమీద్‌,సూర్య కుమార్‌, మజ్జారి చెన్నకేశవులు, జానకిరామ్‌, సుబ్బారెడ్డి, మల్లికార్జున, మామిళ్ళ శ్రీనివాసులు రెడ్డి,శ్రీకాంత్‌, కిరణ్‌ బాబు, అనిల్‌ కుమార్‌,విశ్వనాధ్‌, లక్ష్మయ్య,సుబ్బారావు, భాస్కర్‌ రావు, సి వి ఎస్‌ ఎన్‌ బాబు, వెంకటసుబ్బయ్య, ప్రధానో పాధ్యాయులు గంగన్న, రమణయ్య, పాండురంగారావు, ఎం శ్రీనివాసులు, ఓబులేసు శివకుమార్‌ రాజు, స్వతంత్ర బాబు,సి శ్రీనివాసులు, దేవ దత్తం, ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు మేకల శివార్జున జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాజు జిల్లా కార్యదర్శి గంగాధర్‌ పాల్గొన్నారు. బద్వేలు ఉద్యోగ, ఉపాధ్యాయులను అన్ని రకాలుగా జగన్‌ సర్కార్‌ వంచిందని యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఎస్‌.ఓబుల్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బద్వేలులోని ఆర్‌డిఒ కార్యాలయం వద్ద యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో చెవిలో పూలు పెట్టుకుని వినూత్నంగా నిరసన చేపట్టారు. కార్యక్రమంలో బద్వేలు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.దేవానందం, కె.సుధాకర్‌, సహాధ్యక్షులు ఎం.నరేష్‌, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు ఎస్‌.చెన్నయ్య, పి.చక్రపాణి, పాలా శ్రీనివాసులరెడ్డి, పి.మస్తాన్‌ రెడ్డి, టి.శివ ప్రసాద్‌, కె.ఈశ్వరయ్య, ఓబన్న, డి.ప్రభాకర్‌ రాజు, లాజరయ్య, పి.సుబ్ర హ్మణ్యం, పి.విశ్వనాధ రెడ్డి, యు.నరేంద్ర, ఎం.బాబు, వెంకటరమణ పాల్గొన్నారు మైదుకూరు : ఉద్యోగ ఉపాధ్యాయులకు ‘జగన్‌ అన్న చెవిలో క్యాలీఫ్లవర్‌ పెట్టాడు’ అంటూ యుటిఎఫ్‌ నాయకులు వినూత్నంగా శుక్రవారం స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద చెవిలో క్యాలీఫ్లవర్‌ పెట్టి నిరసన చేపట్టారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు వై.రవికుమార్‌, మండల సహా అధ్యక్షులు రాము, శ్రీనివాసులు, రమణారెడ్డి, ప్రతాపరెడ్డి, పీ.శ్రీనివాసులు, పోతులూరయ్య, తిరుపాలయ్య, వై.శ్రీనివాసులు, సిడి బాషా, అన్వర్‌, హుస్సేన్‌, నజీర్‌బాషా పాల్గొన్నారు. పోరుమామిళ్ల : ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి కుర్రా చెన్నయ్య పేర్కొన్నారు. శుక్రవారం యుటిఎఫ్‌ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు పోరుబాటలో భాగంగా డిప్యూటీ తహశీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర మాజీ కౌన్సిలర్‌ చేరామయ్య, మండల అధ్యక్షులు ఈశ్వరరావు, సీనియర్‌ నాయకులు భాస్కర్‌రెడ్డి, చెన్నకష్ణయ్య, సిద్దయ్య, సింహరాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️