ఉద్యోగుల సమస్యలపై దశల వారీ పోరాటం

Feb 14,2024 21:30

 ప్రజాశక్తి – కురుపాం : ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల కోసం ఎపి జెఎసి పిలుపుమేరకు దశల వారి పోరాటాలు చేస్తామని కురుపాం తాలూకా యూనిట్‌ అధ్యక్షులు ఎస్‌.ఎస్‌.ప్రకాశరావు తెలిపారు. బుధవారం తహశీల్దార్‌ కార్యాలయంలో డిటి నాగేశ్వరరావుకు యూనియన్‌ నాయకులతో కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులతో జెఎసి చర్చలు విఫలం కావడంతో బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైనట్లు చెప్పారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా వినతిపత్రం అందించామన్నారు. కార్యక్రమంలో తాలూకా ఉపాధ్యక్షులు కె.రామకృష్ణ, ఎ.సత్యనారాయణ, ఎస్‌.రమణ, పి.భారతి, ట్రెజరీ బి.సంతోష్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️