ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు ఐక్య కార్యచరణ సమితి (జెఎసి) పిలుపు మేరకు గురువారం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో కడప తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేట్టారు. ఎపి జెఎసి చైర్మన్‌ బి. శ్రీనివాసులు, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, ఎస్‌టియు నాయకులు ఇలియాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యో గులకు చెల్లించాలని బకాయిలను వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 12వ పిఆర్‌సి అమలు చేయాలన్నారు. జిపిఎఫ్‌ ఎపిజిఎల్‌ఐ డిఎ, పిఆర్‌సి బకాయిలు, హరియర్స్‌ చెల్లించాలని కోరారు. ఒపిఎస్‌ అమలు చేయాలన్నారు. పెన్ష నర్లకు అడిషనల్‌ క్వాంటాం పెంచాలని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులందరిని రెగ్యులర్‌ చేయా లన్నారు. ఉపాధ్యాయల సమస్యలను పరిష్క రించాలని పేర్కొన్నారు. 11వ పిఆర్‌సి హరియర్స్‌ ఇవ్వాలన్నారు. ఇహెచ్‌ఎస్‌ అన్ని నెట్‌ వర్క్‌ హాస్పి టల్‌లో నగదు రహిత వైద్యం అందించాలని చెప్పారు. ఐఆర్‌ 30 శాతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 20న జిల్లాలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈనెల 27న చలో విజయవాడలో ర్యాలీ, ధర్నా నిర్వహిస్తామన్నారు. నిరసనలో జెఎసి నాయకులు తిమ్మారెడ్డి, నిత్య పూజయ్య, బాల పులయ్య, వెంకటరెడ్డి, నరేంద్ర, సైలేశ్వర్‌ రెడ్డి, పద్మనాభం, కాటమయ్య, నాయకులు శ్రీనివాసులు, నాగార్జున డి. శ్రీనివాసులు, పోలిరెడ్డి, బాలయ్య, నాగిరెడ్డి, భూషణం పాల్గొన్నారు.కార్మికులకు వేతనాలు ఇవ్వాలని వినతి ఆర్‌టిసి కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు కోరారు. గురువారం నగరంలోని అర్‌టిసి వర్క్స్‌ మేనేజర్‌ హాజంతుల్లాకు వినతి పత్రం అందజేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కామ నురు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఆర్‌టిసి. డిపోలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు సర్క్యులర్‌ ప్రకారం కాంట్రాక్టర్‌ జీతాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. విఎస్‌ఐ, పిఎఫ్‌ మొత్తం కార్మికుల ఖాతాలలో జమ కావడం లేదని చెప్పారు. ఇఎస్‌ఐలో కుటుంబ సభ్యులను చేర్చకపోవడంతో కార్మికులు ఇబ్బంది పడుతు న్నారని తెలిపారు. కార్మికులకు సంవ త్సరానికి ఒకసారి పిఎఫ్‌. ఇఎస్‌ఐ రశీదులు ఇవ్వా లని, 6 నెలలకు ఒకసారి పెరిగే డిఎతో కలిపి చెల్లించాల్సిన జీతం సర్క్యులర్‌ నోటీసు బోర్డులో పొందు పరచాలని పేర్కొన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. స్వీపింగ్‌, క్లీనింగ్‌ వారికి మెటీరియల్‌ కాంట్రాక్టరే ఇచ్చేలా చూడాలని తెలిపారు. ప్రతి నెలా 10లోపు కార్మి కులకు జీతాలు చెల్లించాలని చెప్పారు ఎపిఎస ్‌ఆర్‌టిసి కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కన్వీనర్‌ వి. తులసి రావు మాట్లా డుతూ ప్రతి 6 నెలలకు పెరిగే డిఎ బకాయిలను అరియర్స్‌ రూపంలో కార్మికులకు చెల్లించాలని పేర్కొన్నారు. 6 నెలలకు విడదలయ్యే నోటిఫికేషన్‌ నోటీసు బోర్డు ద్వారా కార్మికులకు తెలియజేయాలని చెప్పారు. కార్మికులందరికి లేబర్‌ హాలీడేస్‌ అమలు చేయాలని కోరారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. థర్డ్‌ పార్టీ విధానాన్ని రద్దుచేసి సంస్థ ద్వారానే కార్మికులకు జీతాలు చెల్లించాలని తెలిపారు. అద్దె బస్సు టెండర్లలో పేర్కొంటున్న విధంగా సిబ్బందికి ఇఎస్‌ఐ, పిఎఫ్‌, ఇడిఎల్‌ఐ వర్తింపచేయాలని పేర్కొన్నారు.

➡️