ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యం విడనాడాలి

Feb 17,2024 00:02

ప్రజాశక్తి-గుంటూరు : ఏపీ జెఎసి పిలుపు మేరకు ఉద్యోగుల ఆందోళనలో భాగంగా శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్‌ ప్రాంగణంలో భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు. గుంటూరు జిల్లా ఏపీ జేఏసీ అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశ వైఖరి విడనాడి, తక్షణం ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని, కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను తక్షణం క్రమబద్ధీకరణ చేయాలని, పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటం ఆఫ్‌ పెన్షన్‌ పాత స్లాబులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం ఉదతం చేస్తామన్నారు. జిల్లా కన్వీనర్‌ శెట్టిపల్లి సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దుచేసి ఉద్యోగులు అందరికీ పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలు తక్షణమే చెల్లించాలని, 12వ పిఆర్సికి సంబంధించి తాత్కాలిక భతి 30శాతం విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీజిఓ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్‌.నాగూర్‌షరీఫ్‌, పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ కూచిపూడి మోహనరావు, జిల్లా అధక్షులు పూర్ణచంద్రారెడ్డి, ఎపిఎన్‌జిఒ జిల్లా సంయుక్త కార్యదర్శి ఎ.శ్యాంసుందర్‌, మహిళా సంయుక్త కార్యదర్శి కె.శివజ్యోతి, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రభుదాస్‌ పాల్గొన్నారు.

➡️