ఉద్రిక్తత

Feb 8,2024 21:26 #ఉద్రిక్తత

కడప నగరంలో గురువారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టిడిపి, వైసిపి నాయకుల మధ్య నెలకొన్న ఘర్షణ చిలికిచిలికి గాలివానల మారి దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది. ఈ సంఘటనలో వైసిపి కార్పొరేట్‌ కుమారుడికి గాయాలయ్యాయి. దీంతో వైసిపి నేతలు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసన తెలియజేశారు. వివరాలు..ప్రజాశక్తి-కడప సోషల్‌ మీడియాలో పోస్టింగుల విషయంలో 39వ డివిజన్‌ కార్పొరేటర్‌ కమల్‌ కుమారులు, టిడిపి బూత్‌ ఇన్‌ఛార్జి ఆరిఫ్‌ మధ్య గురువారం ఘర్షణ చోటు చేసుకుంది. కమల్‌ పెద్ద కుమారుడు షేక్‌ పీరుల్లాపై ఆరిఫ్‌ మరికొంతమందితో కలిసి కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో పీరుల్లా తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు బాధితుడిని హుటాహుటీనా చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వైసిపి కార్పొరేటర్లు, నాయకులు మధ్యాహ్నం కడప టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. పీరుల్లాపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సిఎం తమ్ముడు అహ్మద్‌బాషా పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రి క్తంగా మారింది. విషయంపై ఆరా తీసేం దుకు శ్రీనివాసులరెడ్డి పోలీ సులతో మాట్లాడేందుకు ప్రయ త్నించారు. ఈనేపథ్యంలో వైసిపి నాయకులు టిడిపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అహ్మద్‌బాషా మాట్లాడుతూ కడప ప్రజలను భయ బ్రాంతు లకు గురిచేస్తే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. నగరంలోని 31వ డివిజన్‌లో ఫెక్ల్సీలకు సంబంధించిన వ్యవహారంలో స్థానికంగా విద్వేషాలను రెచ్చగొట్టి వారిలో భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్‌ కుమారుడు పీరుల్లాపై కత్తితో దాడి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం మేయర్‌ సురేష్‌బాబు, వైసిపి యువ నాయకులు అహ్మద్‌బాష, మరికొందరు నాయకులు కలిసి బాధితుడిని రిమ్స్‌కు వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం : డిఎస్‌పి కడప టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 39 వ డివిజన్‌లో పీరుల్లా పై ఆరిఫ్‌ అనే వ్యక్తి, మరికొందరు కత్తితో దాడికి పాల్పడినట్లు తమ దష్టికి వచ్చి ందని, సంఘటనపై సమగ్రంగా విచారించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్‌పి షరీఫ్‌ పేర్కొన్నారు. కాగా సంఘటన జరిగిన సమ యంలో టిడిపి నాయకులు కొందరు పోలీస్‌ స్టేషన్‌ వచ్చారని తరువాత వైసిపి నాయకులు, కార్పొరేటర్లు చేరుకున్నారన్నారు. పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించామని చెప్పారు.

➡️