ప్రభుత్వ పాఠశాలలో మధ్నాహ్న భోజనాన్ని రుచిచూసిన మంత్రి సుభాష్‌

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : ప్రభుత్వం పాఠశాలలో అమలుచేస్తున్న మధ్యాహ్న భోజనం పథకాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ శుక్రవారం పరిశీలించారు. మండలంలోని తాళ్లపాలెం ప్రభుత్వం పాఠశాలలో ఆయన విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అంతటితో ఆగకుండా ఆయనే స్వయంగా ప్లేట్‌ తీసుకొని మధ్యాహ్నం భోజనం రుచి చూశారు. అనంతరం ఇక్కడ పారిశుధ్యం పైన ఆరా తీశారు. పరిసరాలను పరిశుభ్రతను పాటించాలని, మెరుగైన ఆహారం విద్య విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం రామచంద్రపురం జూనియర్‌ కళాశాల ను, పాలిటెక్నిక్‌ కళాశాలను ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. అదేవిధంగా తాగునీరు శుభ్రత కూడా పరిశీలించారు. ప్రస్తుత వర్షాకాలంలో తాగునీటి పైన ప్రత్యేక తీసుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️