‘ఉపాధి’ పనులు కల్పించాలని వినతి

Jan 8,2024 21:47
ఫొటో : డిఎఒకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ఫొటో : డిఎఒకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
‘ఉపాధి’ పనులు కల్పించాలని వినతి
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో వలసలు ఆరికట్టాలని, కరువు సహయక చర్యలు చేపట్టి ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆద్వర్యంలో సోమవారం కావలి డిఎఒకు వినితి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, ఎపి వ్యకాసం జిల్లా అధ్యక్షులు దమ్ము దర్గాబాబు, ఎపి రైతుసంఘం జిల్లా నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుండి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు అనేక కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. గ్రామీణ పేదలకు పనులు కల్పించే ఉపాధి హామీ పథకానికి భారీగా కొతలు విధించడం కేంద్ర బడ్జెట్‌లో క్రమంగా ఉపాధీ నిధులు తగ్గిస్తూ వస్తుందని ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించడం ద్వారా దేశంలో గ్రామీణ ప్రజలకు భద్రత కల్పించడమే కేంద్ర ప్రభుత్వం కొత్తకొత్త నిబంధనలు ఉపాధి కూలీలకు పెట్టడం వల్ల గుదిబండగా తయారయ్యాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్నికి రావాల్సిన నిధులు సక్రమంగా రాకపొవడంతో ఉపాధి పనులు గ్రామీణ ప్రాంతాల్లో అరకొరగా మొదలు పెట్టినందున వలసలు తీవ్రమయ్యాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మండలల్లో 200 రోజులు పని దినాలు కల్పించాలన్నారు. రోజువారీ వేతనం రూ.600 ఇవ్వాలని, పని ప్రదేశంలో పని చేస్తూ ప్రమాదశాత్తు మరణిస్తే రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని, అన్ని వర్గాల చిన్న, సన్నకారు రైతులకు హార్టీకల్చర్‌ ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ ఉదయగిరి నియోజక వర్గ కార్యదర్శి జ్యోతి ఆనందరావు, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

➡️