ఎంఎల్‌సి సాబ్జీ మృతికి పలువురి సంతాపం

Dec 15,2023 21:43
తిరుపతి

ఎంఎల్‌సి సాబ్జీ మృతికి పలువురి సంతాపంప్రజాశక్తి – తిరుపతి టౌన్‌/ సూళ్లూరుపేట ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మృతికి పలువురు సంతాపం తెలిపారు. శుక్రవారం భీమవరం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆయన మృతికి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి సంతాపం ప్రకటించారు. అంగన్‌వాడీల పోరాటానికి మద్దతు తెలిపేందుకు ఏలూరు నుంచి భీమవరానికి వెళుతుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ముత్యాలరెడ్డి ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఎంఎల్‌సి అయినా సమస్యల పరిష్కారానికి సాధారణ కార్యకర్తలా పనిచేశారన్నారు. తిరుపతి యుటిఎఫ్‌ కార్యాలయంలో శ్రద్ధాంజలి ఘటించారు. బండి మధుసూదన్‌రెడ్డి, దేవరాల నిర్మల, దండు రామచంద్రయ్య, అవనిగడ్డ పద్మజ, మోహన్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సూళ్లూరుపేటలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జిజె రాజశేఖర్‌ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. సి.చంద్రశేఖర్‌, కె.ప్రభాకర్‌ , రమణయ్య, కె.లక్ష్మయ్య పాల్గొన్నారు. మాజీ ఎంఎల్‌సి యండపల్లి శ్రీనివాసులురెడ్డి ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు.

➡️