ఎంపిల సస్పెన్షన్‌తో ప్రజాస్వామ్యం అపహాస్యం

Dec 22,2023 20:38
ఫొటో : మాట్లాడుతున్న సిపిఎం సినీయర్‌ నాయకులు తాళ్లూరు మాల్యాద్రి

ఫొటో : మాట్లాడుతున్న సిపిఎం సినీయర్‌ నాయకులు తాళ్లూరు మాల్యాద్రి
ఎంపిల సస్పెన్షన్‌తో ప్రజాస్వామ్యం అపహాస్యం
ప్రజాశక్తి-జలదంకి : దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లోక్‌సభ, రాజ్యసభలలో 146మంది ఎంపిలను సప్పెండ్‌ చేసి మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యన్ని అపహస్యం చేసిందని సిపిఎం సినీయర్‌ నాయకులు తాళ్లూరు మాల్యాద్రి, సిపిఐ నాయకులు దమ్ము దర్గాబాబు, సిపిఎం నాయకులు ఎం.అంథోని బాబు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని సురే చెంచురెడ్డి భవనంలో పత్రికా విలేకరుల సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటుపై దాడితో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. ఈ ఘటనపై వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు నోరుమెదపటం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న టిడిపి, చట్టసభల్లో మోడీ నిరంకశ వైఖరిపై మాట్లాడకపోవడాన్ని తీవ్రంగా విమర్శంచారు. ప్రజలందరూ బిజెపి చర్యలను వ్యతిరేకించాలని కోరారు.

➡️