‘ఎడిఎఫ్‌’తో అభివృద్ధిని కొనసాగిస్తాం..

Mar 16,2024 22:27
ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ మేకపాటి విక్రమ్‌రెడ్డి
‘ఎడిఎఫ్‌’తో అభివృద్ధిని కొనసాగిస్తాం..
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు డెవలప్‌మెంట్‌ ఫోరం (ఎడిఎఫ్‌)తో నియోజకవర్గంలో అభివృద్ధిని కొనసాగిస్తామని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం బోయలచిరువెళ్ల, ఆరవీడు, ఆరవీడు జంగాలపల్లి, గొల్లపల్లి, బోయలచిరువెళ్ల గ్రామాల్లో శనివారం విజయీభవయాత్రను నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని దేవాలయంలో ఎంఎల్‌ఎ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ విక్రమ్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి రానున్న సాధారణ ఎన్నికల్లో తోడుగా ఉండి ప్రతిఒక్కరూ మద్దతుగా నిలబడాలన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వస్తేనే ప్రజాసంక్షేమ పథకాలు అమలవుతాయని, ప్రజలందరూ గుర్తించుకోవాలన్నారు. ఇప్పటి వరకు జగనన్న ఆరవీడు గ్రామాభివృద్ధికి రూ.8.43కోట్లు అందజేశామన్నారు. ఇందులో డిబిటి ద్వారా 2246 మందికి, నాన్‌ డిబిటి ద్వారా 859 మందిక లబ్ధి చేకూరిందని వివరించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటిస్తున్న సమయంలో గ్రామస్తులు తమ దృష్టికి అధికంగా రెవెన్యూ సమస్యలు తీసుకొచ్చారని, జగనన్న తెచ్చిన సంస్కరణలు జిల్లా కలెక్టర్‌తో జరిపిన చర్చలతో ఆరవీడు గ్రామంలో 143మంది రైతులకు 340 ఎకరాల్లో సమస్య పరిష్కారమైందన్నారు. రానున్న రోజుల్లో చేయబోయే అభివృద్ధిని కూడా ప్రజలకు వివరించి వాటిని తప్పక పూర్తి చేస్తామని హామీనిస్తున్నామని తెలిపారు. ఉత్తరకాలువ ద్వారా చెరువులకు నీళ్లు అందించేందుకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్మాణానికి అనుమతులు మంజూరు కావడం జరిగిందని, రానున్న రెండేళ్ల కాలంలో వీటిని పూర్తి చేసి మీ చెరువులన్నింటికీ సాగునీరు అందించేలా కృషి చేస్తామన్నారు. ఇంకా గ్రామంలో అవసరమైన సిమెంటు రోడ్లు, గ్రావెల్‌ రోడ్డు, సైడు కాలువలు పనులన్నింటినీ పూర్తి చేస్తామని వివరించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రభుత్వ సహకారానికి తోడు ప్రయివేట్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసుకునే విధంగా ఏర్పాటు చేసిన ఆత్మకూరు డెవలప్‌మెంట్‌ ఫోరం ద్వారా ఇప్పటి వరకు రూ.20కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించామని తెలిపారు. ఆరవీడు గ్రామంలో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం చేపడుతామన్నారు. అంతేకాక ప్రతి 10 పంచాయతీలకు కలిపి ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా బోయలచిరువెళ్లలో సంక్షేమాభివృద్ధి కోసం రూ.15.2 కోట్లు మంజూరు చేశామన్నారు. 232మంది రైతన్నల భూసమస్యలను పరిష్కరించామని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా రూ.30లక్షలతో అభివృద్ధి పనులను నిర్వహించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామస్తులు, రైతులు, ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకొచ్చిన పనులను తప్పక పూర్తి చేస్తామని, ఇందుకోసం ప్రత్యేకంగా గ్రామ మేనిఫెస్టోను గ్రామంలోనే ఏర్పాటు చేసి వాటన్నింటినీ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం మే 13న ఎన్నికలు జరగనున్నాయని, మీ సంక్షేమానికి, మీ కుటుంబ ఆర్థిక ప్రగతి కోసం ఎన్నో సార్లు బటన్‌ నొక్కిన జగన్నన కోసం రానున్న ఎన్నికల్లో ఎంపి, ఎంఎల్‌ఎ అభ్యర్థులకు రెండు బటన్లు నొక్కి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి కేత వేణుగోపాల్‌ రెడ్డి, మండల రూరల్‌ కన్వీనర్‌ చిట్టమూరు జితేంద్ర నాగ్‌రెడ్డి, జెడ్‌పిటిసి పెమ్మసాయన ప్రసన్నలక్ష్మి, ఆరవీడు సర్పంచి ప్రసాద్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️