ఎన్‌ఇపిని విద్యార్థులు ప్రతిఘటించాలి

 జాషువా విజ్ఞాన కేంద్రంలో మాట్లాడుతున్న కెఎస్‌ లక్ష్మణరావు

 గుంటూరు: పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే నూతన జాతీయ విద్యావిధానాన్ని (ఎన్‌ఇపి) విద్యార్థులు ప్రతిఘటించాలని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు పేర్కొన్నారు. స్థానిక బ్రాడీపేటలోని జాషువా విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా 48వ మహాసభల్లో ఆయన పాల్గొని ప్రసం గించారు. బిజెపి ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్‌ఇపిని తెచ్చిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయకపోయినా ఏపీలో అమలు చేయటం దారుణ మన్నారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థల పరి రక్షణకు ఎస్‌ఎఫ్‌ఐ చేసిన కృషిని అబి óనందిస్తూ రాబోయే రోజుల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా పూర్వ కార్యదర్శి ఎన్‌.భావన్నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు, చదువులో ఎదురయ్యే సమస్యలపై అవగాహన పెంచుకొని, వాటి పరిష్కారానికి పోరా డాలన్నారు. పాలకుల విధానాలు విద్యను ప్రభావితం చేస్తున్నాయని, కావున వాటిని నిరంతరంతెలుసుకోవాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అందులో ముఖ్యంగా సంక్షేమ హాస్టల్స్‌లో మౌలిక వసతులు లేవని, ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వట్లేదన్నారు. ఎన్‌ఇపిలో భాగంగా నాలుగేళ్ల డిగ్రీ విధానం వల్ల బాలికలు విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు. అద ేవిధంగా డిగ్రీలో మేజర్‌, మైనర్‌ సబ్జెక్ట్‌ విధానంపై ముందస్తు ప్రణాళిక లేకుండా విద్యార్థులను అయోమయానికి గురి చేస్తోందని విమర్శించారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వృత్తి విద్య కోర్సుల్లో కుల, మతత్వాలు జొప్పించాలని చూస్తుం దన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయటం వల్ల చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గి పోతున్నాయన్నారు. సంక్షేమ హాస్టల్స్‌లో మౌలిక వసతులు కల్పించాలని, ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ప్రభుత్వమే అందించాలని, జీవో నెంబర్‌ 77ను, నాలుగేళ్ల డిగ్రీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్‌ మాట్లాడుతూ నగరంలో నిర్మాణం పూర్తి అయిన కోడిగుడ్డు సత్రం హాస్టల్‌ను వెం టనే ప్రారంభించాలని, లేదంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మహా సభలో జిల్లా ఉపాధ్యక్షులు సుచరిత, ఎస్‌. సమీర్‌, సుభాష్‌ సహాయ కార్యదర్శులు ఈశ్వర్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️