ఎన్నికల కమిషన్‌ సూచనలను కట్టుదిట్టంగా అమలు చేయాలి

ప్రజాశక్తి – కడప భారత ఎన్నికల కమిషన్‌్‌ సూచనలను, నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి వి.విజరు రామరాజు రిటర్నింగ్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తీరుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్‌ బోర్డు మీటింగ్‌ హాల్‌ నుంచి జిల్లా ఎన్నికల అధికారితోపాటు జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌ కుమార్‌, కడప నగర కమిషనర్‌ ప్రవీణ్‌ చంద్‌, డిఆర్‌ఒ గంగాధర్‌ గౌడ్‌ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం రిటర్నింగ్‌ అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండెక్ట్‌ (ఎంసిసి) అమలుపై ఇచ్చిన సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. జిల్లాలో ఎలక్ట్రానిక్‌ సీజర్స్‌ మేనేజ్మంట్‌ సిస్టం వినియోగాన్ని విస్తతం చేయాలన్నారు. జిల్లా పరిధుల్లోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లోనూ నిఘాను పటిష్టం చేయాలన్నారు. ఎన్నికల సంఘం జారీచేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం దాదాపు 33 ఎసెన్సియల్‌ శాఖలకు చెందిన ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పించారనిచెప్పారు. వీటిలో ముఖ్యంగా పోలీస్‌, విద్యుత్‌, రవాణా, పోస్టల్‌ తదితర శాఖలతో పాటు ఎన్నికల విధులకు (సంబందిత అథారిటీ లేఖతో) హాజరయ్యే మీడియా ప్రతినిధులకు, అనుమతించిన శాఖల ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ‘సువిధ’ సేవలపై దష్టి సారించాలన్నారు. రాజకీయ పార్టీలు నిర్వహించే ఎటు వంటి కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి తీసుకునేలా చూడాలన్నారు. నేరుగా కానీ, ఎన్కోర్‌ పోర్టల్‌ ద్వారా కానీ అందే దరఖా స్తులను వెంటనే పరిశీలించి సకాలంలో అనమతులను మంజూరు చేయా లన్నారు. శాంతి భద్రతల నిర్వహణ విషయంలో ఎంతో అప్రమ్తతంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగింపునకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫార్ము-7 లను, ఫార్ము-8 లను చట్టబద్దమైన విధానంలో ఈ నెల 26లోగా పూర్తిగా పరిష్కరించాలని ఆదేశించారు. నూతన ఓటర్ల నమోదు విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, చివరి నిమిషంలో హడావుడిగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టవద్దన్నారు. క్రమపద్దతిలో వ్యక్తిగతంగా ధాఖలు చేసిన ఫార్ము-6 లను క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి మాత్రమే నూతన ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలకు సంబంధించి ఎన్నికల సంఘానికి పంపాల్సిన నివేదికల విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకూడదని సూచించారు. కార్యక్రమంలో కౌసర్‌ భానో, చంద్రమోహన్‌, ఆర్‌ఒలు మధుసూదన్‌, శ్రీనివాసులు, వెంకట రమణ, ప్రత్యూష, ఎస్‌ఎస్‌ఎ పిఒ .ప్రభాకర్‌ రెడ్డి, డిఐఒ విజరు కుమార్‌, హెచ్‌.సెక్షన్‌ సూపరింటెండెంట్‌ ధనుంజయ పాల్గొన్నారు.

➡️