ఎన్నికల వేళ ప్రారంభోత్సవాల జోరు

Mar 14,2024 22:06

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎ న్నికల సమీపిస్తున్న వేళ నగరంలో ఎమ్మెల్యేకోలగట్ల వీరభద్రస్వామి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు ఊపందు కున్నాయి. గురువారం బాలాజీ నగర్‌ బ్యాంక్‌ కాలనీ పార్కులో ఏర్పాటు చేసిన వాకింగ్‌ ట్రాక్‌ను, రూ. 1.50కోట్లతో ఆధునికీరించిన నెహ్రూ పార్కును, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు. ప్రత్యేకం గా పిల్లలకోసం పార్కును ఏర్పాటు చేయడం ఎక్కడా లేదన్నారు. మేయర్‌ విజయలక్ష్మి, బాలి ప్రతాప్‌, వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ ఏరియా కోఆర్డినేటర్‌ జి కష్ణంరాజు, బాలాజీ వాకర్స్‌క్లబ్‌ కార్యదర్శి రవికుమార్‌ పాల్గొన్నారు. స్థానిక మయూరి ఎత్తు బ్రిడ్జి డౌన్‌ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్‌ను కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు. బస్సు ప్రయాణికు లకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఆధునిక వసతులతో ఈ షెల్టర్‌ ప్రారంభించా మన్నారు. కార్యక్రమ ంలో జోనల్‌ ఇన్చార్జులు బొద్దాన అప్పారావు, మారం బాల బ్రహ్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ జివి రంగారావు, వైసిపి నాయకులు భోగాపురపు రవిచంద్ర, బాలి ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు. అయ్యకోనేరు దక్షిణ గట్టు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన కళావేదికను కోలగట్ల ప్రారంభించారు. నేటి నుండి కళాకారులు తమ కళను ప్రదర్శించాలన్న ఔత్సాహికులు ఆదిభట్ల కళావేదికను వినియోగించు కోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో కెఎపి రాజు, బుచ్చిరాజు, మండపాకరవి తదితరులు పాల్గొన్నారు.కోలగట్ల ను గెలిపించుకుంటాం రానున్న ఎన్నికలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచి, కోలగట్ల వీరభద్రస్వామిని మరోసారి గెలిపించు కుంటామని నాయీ బ్రాహ్మణ సంఘం తీర్మానించింది. కంటోన్మెంట్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామేశ్వరపు రామారావు మాట్లాడారు. జోనల్‌ఇన్‌ఛార్జుల కోలగట్ల తమ్మన్న శెట్టి, డాక్టర్‌ వి ఎస్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులకు చంద్రబాబు నాయుడు ఎటువంటి సహాయం చేయలేదన్నారు. తమ సామాజిక వర్గాన్ని కించిపరిచి పిలవకుండా ఉండేందుకు ప్రత్యేక చట్టాన్ని జగన్మోహన్‌ రెడ్డి తీసుకువచ్చారని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

➡️