ఎన్‌సిసి క్యాడెట్లు ఎంపిక

Dec 19,2023 20:18
ఎన్‌సిసి క్యాడెట్లను అభినందిస్తున్న దృశ్యం

ఎన్‌సిసి క్యాడెట్లను అభినందిస్తున్న దృశ్యం
ఎన్‌సిసి క్యాడెట్లు ఎంపిక
ప్రజాశక్తి-నెల్లూరుకేరళలోని ఎన్‌సిసి గ్రూప్‌ హెడ్‌క్వార్టర్‌ కొట్టాయం, కులమావులో ఈ నెల 22 నుంచి 29వ తేదీ వరకూ నిర్వహించనున్న ఆల్‌ ఇండియా ట్రెక్కింగ్‌ క్యాంప్‌, ట్రెక్‌-1శిభిరంలో పాల్గొనేందుకు భక్తవత్సలనగర్‌ ప్రాంతంలోని కెఎన్‌ఆర్‌ నగర పాలక ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్‌సిసి క్యాండెట్లు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయప్రకాష్‌ తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడారు. మాట్లాడుతూ 10 ఆంధ్ర నేవల్‌ యూనిట్‌ ఎన్‌ సి సి.నెల్లూరు లెఫ్ట్నెంట్‌ కమాండర్‌ వినరు రామచంద్రన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ ఉత్తర్వుల మేరకు కె.ఎన్‌.ఆర్‌ నగర పాలక ఉన్నత పాఠశాల, బి. వి. నగర్‌, నెల్లూరులోని 10 ఆంధ్ర నేవల్‌ యూనిట్‌ ఎన్‌ సి సి కేడెట్లు పువ్వాడి గురవయ్య, కంచర్ల. వెంకట దినేష్‌, పొక్కింగారి మోహిత్‌ రామ్‌ కేరళ రాష్ట్రం లోని ఎన్‌ సి సి గ్రూప్‌ హెడ్‌ క్వార్టర్‌ కొట్టాయం, కులమావులో ఈ నెల 22 నుంచి 29 వ తేది వరకు నిర్వహించబోవు ఆల్‌ ఇండియా ట్రెక్కింగ్‌ క్యాంప్‌, ట్రెక్‌ -1కి ఎంపికయ్యారన్నారు. ఈ పాఠశాల ఎన్‌సిసి సెకండ్‌ ఆఫీసర్‌ గుండాల నరేంద్రబాబు మాట్లాడుతూ ఈ క్యాంపుకు మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ,పాండిచేరి మరియు అండమాన్‌ నుంచి ఐదు వందల పది మంది ఎన్‌ సి సి కేడేట్లు హాజరౌతున్నారన్నారు.

➡️