ఎమ్మెల్యేలకు అంగన్వాడీల నిరసన సెగ

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి 16వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తూనే ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాలను ముట్టడించారు. ఒంటికాలిపై, చెవులు మూసుకుని, చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ అంగన్‌వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించి, సమ్మెను విర మించేలా చొరవచూపాలని కోరుతూ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. బుధవారం ప్రభుత్వ జానియర్‌ కలాశాల నుండి రాయచోటి, లక్కిరెడ్డిపల్లి ప్రాజెక్టులలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు భారీ ర్యాలీగా వెళ్లి ధర్నా చేప ట్టారు. ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు విస్మరించడంపై విరు చుకుపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి ప్రాజెక్టుల అంగన్వాడీ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.భాగ్యలక్ష్మి, ఎస్‌.ఓబులమ్మ, జె.షుకుమారి వి.సిద్ధమ్మ, పి.బంగారుపాప మాట్లాడుతూ అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీల చేపట్టిన సమ్మె 16 రోజులకు చేరిందని, అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాల పెంపు, గ్రాట్యూటీ అమలు తదితర విషయాల్లో ప్రభుత్వం నోరు మెదపలేదని పేర్కొన్నారు. గతంలో జరిగిన చర్చల్లో మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మారుస్తామని అంగీకరించారని, ఇప్పటి వరకు దీనికి సంబంధించిన జిఒ ఇవ్వలేదన్నారు. పరిష్కరించకుండా ఉద్యోగులతో కేంద్రాల. సమస్యలను సచి వాలయ చేత తాళాలు పగలగొట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ గ్రేడ్‌-2 సూపర్వైజర్‌ 560 పోస్టులు ఇచ్చామని మంత్రి ఉషశ్రీ చరణ్‌ అబద్ధాలు ఆడుతున్నారన్నారు. తమ సమ్మెకు లిబ్దిదారుల నుంచి అపూర్వ మద్దతు లభిస్తుందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలను తెరవాలని ప్రభుత్వం నాలుగు శాఖలతో తలకిందులుగా తపస్సు చేసిందన్నారు. ఇప్పటి వరకు ఒక్క పిల్లాడికి కూడా సరైన తిండి పెట్టలేకపోతుందన్నారు. ప్రభుత్వం అద్దెలు ఇవ్వకపోయినా గఠిణుేలు, బాలింతలకు పోషణ అందించామన్నారు. లబ్దిదారులకు ఇచ్చేఆహారం నాసిరకంగా ఉందని, నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్‌ చేశారు. గ్రాట్యూటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్‌ కేంద్రాలుగా మార్చాలని కోరారు. డిమాండ్లనూ పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు ఎల్లవేళలా తోడుగా నిలుస్తామని అన్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వ దష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కషి చేస్తామన్నారు. మంత్రి బొత్సా సత్యనారాయణతో ఈ రోజే ఫోన్లో మాట్లాడుతానని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో జీతాలు పెంచి పబ్బం గడుపుకునే మనస్తత్వం సిఎం జగన్‌ ది కాదన్నారు. ఎన్నికలు అయిన తరువాత మంచి చేయాలని చూసే గొప్ప మనస్తత్వమన్న నాయకుడన్నారు. కార్యక్రమం జి.భోగేశ్వరయ్య, ఎపిఎస్‌ఆర్‌టిసి నాయకులు తులసి రామ్‌, సురేష్‌ రైతు సంఘాల జిల్లా కార్యదర్శ రామచంద్ర, మధు, యూనియన్‌ నాయకులు విజయమ్మ, సిద్దమ్మ, సుకుమారి, ప్రభావతి, నాగమణి, అరుణ, మస్రూన్‌ బీ, సుమలత, వనజ, ప్రవీణ, సబీనా, రమీజా, ఇందిరమ్మ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద బైఠాయించిన వందలాది మంది అంగన్వాడీలకు భోజన వసతిని కల్పించారు. రైల్వేకోడూరు : ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కార్యాలయం ఎదుట అంగన్వాడీలు బైఠాయించి నిరసన తెలిపారు. పలు డిమాండ్లపై ఆయనకు వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, వారి సమస్యలను క్లుప్తంగా విని త్వరలోనే సిఎం దష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారమైయే దిశగా మార్గం చూపుతామని వారికి హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే శ్రీనివాసులుకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు కతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ సుకుమార్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ శివ సాయి, జిల్లా టూరిజం డైరెక్టర్‌ సుధాకర్‌ రాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.చంద్రశేఖర్‌, అంగన్వాడీలు, ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మదనపల్లి : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద నుండి ర్యాలీగా మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌ బాషా ఇంటి వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపారు. ఆయన లేకపోవడంతో ఇంటి గేటుకు వినతిపత్రాన్ని అంటించి నిరసన తెలిపారు. టిడిపి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు, దొరస్వామి నాయుడు సంఘీభావం తెలిపారు. తంబల్లపల్లి సెక్టార్‌ అంగన్వాడీ కార్యకర్తలు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద నుండి ర్యాలీగా వెళ్లి తంబల్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఇంటి వద్దకు చేరుకుని అక్కడ ధర్నా చేశారు. అనంతరం ఆయనకు వినతిపత్రాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, నాయకులు హరింద్రనాథ్‌ శర్మ, మధురవాణి, రాజేశ్వరి మాట్లాడుతూ 16 రోజులుగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గౌరీ, కరుణ, స్వారూపా, భూకైలేశ్వరి, అమ్మాజీ, విజయ, అఖిరున్నిసా, బాగ్యా, గీతా సుజాని, శ్రీవాణి, ఈశ్వరి మరియు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️