ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు సత్కారం

ప్రజాశక్తి-పొదిలి: వైసిపి మార్కాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమితులైన గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు ఆదివారం పొదిలికి వచ్చిన సందర్భంగా స్థానిక విశ్వనాథపురం ఆంజనేయస్వామి గుడి వద్ద పొదిలికి చెందిన నాయకులు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, జిల్లా ఎంపిపిల సంఘం అధ్యక్షులు, మర్రిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, పొదిలి మాజీ ఎంపీపీ కోవెలకుంట్ల నరసింహారావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు గుజ్జుల సంజీవరెడ్డి, మాదాలవారిపాలెం మాజీ సర్పంచ్‌ పెమ్మని ఓంకార్‌ యాదవ్‌, మాజీ మండల వైసీపీ యూత్‌ అధ్యక్షులు గుంటూరు పిచ్చిరెడ్డి, ప్రముఖ కాంట్రాక్టర్‌ వెన్నా శ్రీరామిరెడ్డి, పట్టణ యూత్‌ గౌస్‌ బాషా, యువ కార్యకర్తలు పాల్గొన్నారు.పొదిలి నాయకుల సత్కారం మార్కాపురం సమన్వయకర్తగా నియమితులైన గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు పరిచయ వేదిక కార్యక్రమం ఆదివారం మార్కాపురంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కెపి నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వైసిపి రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి గొలమారి చెన్నారెడ్డి, మండల కన్వీనర్‌ దుగ్గెంపూడి శ్రీనివాసరెడ్డి, కసిరెడ్డి వెంకట రమణారెడ్డి, ముక్కు శ్రీనివాసరెడ్డి గజమాలతో ఇద్దరు శాసనసభ్యులను సత్కరించారు. అదే విధంగా అన్నా వెంకట రాంబాబును, వారి కుమారుడు అన్నా కృష్ణ చైతన్యను పరిచయ వేదిక కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే కె నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిచయ కార్యక్రమంలో మాదాలవారిపాలెం సచివాలయం కన్వీనర్‌ గుంటూరి నాగిరెడ్డి, సొసైటీ ప్రెసిడెంట్‌ ఆనికాళ్ళ ఈశ్వరరెడ్డి, మండల సోషల్‌ మీడియా కన్వీనర్‌ చల్లా వెంకట రామిరెడ్డి, పోతవరం వైసీపీ యూత్‌ నాయకుడు, గృహ సారథి బోనం బ్రహ్మారెడ్డి, కామునూరి వెంకటరావు, పెమ్మని రమేష్‌, కామునూరి రాముడు పాల్గొనగా మండలం లోని వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు మార్కాపురం పరిచయ వేదిక కార్యక్రమానికి తరలివెళ్లారు. 

➡️