ఎమ్మెల్యే గోపిరెడ్డికి వ్యతిరేకంగా ధర్నా

Dec 28,2023 01:24

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన అసమ్మతి నాయకులు బుధవారం సాయంత్రం తాడేపల్లిలో సిఎం క్యాంపు ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. వైసిపి నాయకుడు గజ్జెల బ్రహ్మరెడ్డి నాయకత్వంలో వందలాది మంది కార్యకర్తలు, స్థానిక నాయకులు పలువురు తాడేపల్లికి చేరుకున్నారు. శ్రీనివాసరెడ్డి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పార్టీ ప్రతిష్టను మంటగలుపుతున్నారని గజ్జెల బ్రహ్మారెడ్డి ఆరోపించారు. శ్రీనివాస్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇవ్వకూడదన్నారు. గతంలో శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా ఉన్న రొంపిచర్ల జెడ్‌పిటిసి పిల్లి ఓబుల్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ హనీఫ్‌ తదితరులు కూడా బ్రహ్మారెడ్డితో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. శ్రీనివాసరెడ్డికి టిక్కెట్‌ ఇవ్వవద్దని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. కొంత కాలంగా శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న బ్రహ్మారెడ్డి ఈసారి ఏకంగా సిఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు. ఈ విషయంపై అధినాయకత్వం సీరియస్‌ అయినట్టు తెలిసింది.

➡️