ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు సన్మానం

ప్రజాశక్తి-కనిగిరి: ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ కనిగిరి వచ్చిన సందర్భంగా ఆదివారం స్థానిక అమరావతి గ్రౌండ్లో టిడిపి శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం టిడిపి నాయకులు శ్రీకాంత్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చేలా పార్టీ శ్రేణులు సైనికుల వలె కషి చేయాలని సూచించారు. కనిగిరి ప్రాంత అభివృద్ధి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ద్వారానే సాధ్యమవుతుందని ఆయన ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు షేక్‌ ఫిరోజ్‌, షేక్‌ అహ్మద్‌, తమ్మినేని వెంకటరెడ్డి, చింతలపూడి తిరుపాలు, ఈదర రవికుమార్‌, చిలకపాటి లక్ష్మయ్య, నజీముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️